INDW vs BANW: బంగ్లాపై భారత్ భారీ విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. ఆకట్టుకున్న స్నేహ్ రాణా, భాటియా
ICC Women's World Cup 2022: మహిళల ప్రపంచ కప్‌లో మిథాలీ సేన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 22వ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్ అద్భుత విజయంతో వరుస పరాజయాలను బ్రేక్ చేసింది.
మహిళల ప్రపంచ కప్(Women’s World Cup 2022)లో మిథాలీ సేన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 22వ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్ అద్భుత విజయంతో వరుస పరాజయాలను బ్రేక్ చేసింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఎలాగైన గెలవాల్సిన ఈ మ్యాచులో టీమిండియా ఘనంగా తిరిగి వచ్చింది. ఈ కీలక మ్యాచులో టీమిండియా 110 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలోనూ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచింది. లక్ష్యం కూడా స్వల్పమే అయినా.. బంగ్లాదేశ్(India Women vs Bangladesh Women) ఇన్నింగ్స్ పేలవంగా మొదలుపెట్టింది. ఆరో ఓవర్‌లో, షర్మిన్ అక్తర్ 5 పరుగుల వద్ద రాజేశ్వరి గైక్వాడ్ చేతిలో చిక్కి పెవిలియన్ చేరింది. షర్మిన్ క్యాచ్‌ని ఫస్ట్ స్లిప్‌లో స్నేహ్ రాణా పట్టుకుంది.
అనంతరం ఫర్గానా హోక్ (0)కి పూజా వస్త్రాకర్ ఎల్‌బీడబ్ల్యూ చేసి, భారత్‌కు రెండో వికెట్‌ను అందించింది. రివ్యూలో టీమిండియాకు ఈ వికెట్ దక్కింది. వాస్తవానికి, అంపైర్ ఫర్గానాకు నాటౌట్ ఇచ్చాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ మిథాలీ రాజ్ DRS డిమాండ్ చేసింది. రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌కు తగిలిందని తేలింది. స్కోరు 28 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ పడిపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 11 బంతుల్లో 3 పరుగుల వద్ద స్నేహ రానా పెవిలియన్ చేర్చింది. ఈ క్యాచ్‌ను మిడ్ ఆన్ వద్ద హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది.
ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ 54 బంతుల్లో 19 పరుగులు చేసి పూనమ్ యాదవ్ చేతిలో ఔట్ అయింది. ముర్షిదా ఇచ్చిన క్యాచ్ కూడా హర్మన్ చేతికి చిక్కింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్నేహ రాణా.. రుమానా అహ్మద్ (2)ను అవుట్ చేసి భారత్‌కు 5వ వికెట్‌ను అందించింది. రుమానా క్యాచ్‌ను షార్ట్ లెగ్ వద్ద యాస్తిక భాటియా క్యాచ్ పట్టింది. ఆరో వికెట్‌కు సల్మా ఖాతూన్, లతా మండల్ 62 బంతుల్లో 40 పరుగులు జోడించి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సల్మా (32)ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ గోస్వామి ఈ జోడీని విడదీసింది.
లతా మండల్ 24 పరుగుల వద్ద పూజా వస్త్రాకర్ చేతిలో పెవిలియన్ చేరింది. ఈ మ్యాచ్‌లో స్నేహ రానా తన మూడో వికెట్ రూపంలో ఫాహిమా ఖాతూన్ (1) ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ చేర్చింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా (50) టాప్ స్కోరర్‌గా నిలవగా, షెఫాలీ వర్మ 42 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో రీతూ మోని 3 వికెట్లు పడగొట్టింది. నహిదా అక్తర్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి.
రెండు జట్లు-
భారత్ : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
బంగ్లాదేశ్: షర్మిన్ అక్తర్, ముర్షిదా ఖాతూన్, ఫర్గానా హోక్, నిగర్ సుల్తానా (కెప్టెన్), రుమానా అహ్మద్, రీతు మోని, లతా మండల్, సల్మా ఖాతూన్, నహిదా అక్తర్, ఫాహిమా ఖాతూన్, జహనారా ఆలం.