AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?

మహేంద్ర సింగ్ ధోనీ, ఫాఫ్ డు ప్లెసిస్, శిఖర్ ధావన్ వంటి సూపర్ సీనియర్లు ఫిట్‌నెస్ బలంతో ఈ ఫాస్ట్ క్రికెట్‌లో పవర్ ప్యాక్డ్ ప్రదర్శన చేస్తున్నారు. ఈ సూపర్ సీనియర్ల సంచలన రికార్డులు, వారి ఫిట్‌నెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?
Ipl 2022 Oldest Players In Ipl
Venkata Chari
|

Updated on: Mar 22, 2022 | 2:38 PM

Share

ఐపీఎల్ 15వ సీజన్(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 క్రికెట్ అనేది యువ ఆటగాళ్ల ఫార్మాట్ అని అంటారు. అయితే ఈ సీజన్‌లో  యువకులు, సీనియర్లు కలిసి బరిలోకి దిగనున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, ఫాఫ్ డు ప్లెసిస్, శిఖర్ ధావన్ వంటి సూపర్ సీనియర్లు ఫిట్‌నెస్ బలంతో ఈ ఫాస్ట్ క్రికెట్‌లో పవర్ ప్యాక్డ్ ప్రదర్శన చేస్తున్నారు. ఈ సూపర్ సీనియర్ల సంచలన రికార్డులు, వారి ఫిట్‌నెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శిఖర్ ధావన్- గత 3 సీజన్లలో 500 ప్లస్ పరుగులు..

36 ఏళ్ల భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గత మూడు ఐపీఎల్ సీజన్‌లలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాట్ గత మూడు సీజన్లలో 500+ పరుగులు చేసింది. గబ్బర్ 2019 ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 521 పరుగులు చేయగా, 2020 సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు, ఐపీఎల్ 2021లో 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులు చేశాడు. ఈసారి కూడా అతని బ్యాట్ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు.

శిఖర్ ధావన్ ఈసారి కొత్త జట్టు పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌లో జట్టులో చేరేందుకు శిఖర్‌కు కూడా ఒక అవకాశంగా మారింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం ద్వారా మరోసారి సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకోవచ్చు. ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియాలోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, ధావన్ ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా తన వాదనను ప్రదర్శించాలనుకుంటున్నాడు.

ఫిట్‌నెస్- గబ్బర్ ఫిట్‌గా ఉండటానికి ప్రతి వారం 2 లేదా 3 కార్డియో సెషన్‌లు చేస్తుంటాడు. కచ్చితంగా ఒకటి లేదా రెండు సెషన్‌లు చేసేందుకు సమయం కేటాయిస్తుంటాడు. అలాగే బరువు తగ్గడం కోసం కూడా వారానికి మూడు సార్లు జిమ్‌కు వెళ్తుంటాడు. పవర్ లిఫ్టింగ్ అంటే కూడా శిఖర్‌కు ఎంతో ఇష్టం.

2. మహేంద్ర సింగ్ ధోని – వికెట్ వెనుక చురకత్తి

సీనియర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన పేరు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది. ధోనీ వయస్సు 40 సంవత్సరాలు, కానీ నేటికీ అతను ప్రపంచంలోని ఫిటెస్ట్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. అయితే బ్యాట్స్‌మెన్‌గా గత రెండు సీజన్‌లుగా ఫ్లాప్‌గా నిలిచాడు. 50+ స్కోర్ కూడా చేయలేదు. కానీ ఈసారి బ్యాట్ బిగ్గరగా మాట్లాడుతుందని భావిస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సీఎస్‌కే ఎక్కువ లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఇక్కడ ధోనీ రికార్డు అద్భుతంగా ఉండడమే ఇందుకు కారణం.

వాంఖడే స్టేడియంలో 18 ఇన్నింగ్స్‌లలో 115.73 స్ట్రైక్ రేట్‌తో ధోనీ 287 పరుగులు, DY పాటిల్ స్టేడియంలో 3 ఇన్నింగ్స్‌లలో 126.56 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగులు చేశాడు. పూణె గురించి మాట్లాడుకుంటే, MCA స్టేడియంలో కూడా, అతని బ్యాట్ 18 ఇన్నింగ్స్‌లలో 141.79 స్ట్రైక్ రేట్‌తో 492 పరుగులు చేసింది.

ఫిట్‌నెస్- మహి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాడు. కొవ్వు పదార్ధాలు అస్సలు దరిచేరనివ్వడు. ఇవి చురుకుదనాన్ని ప్రభావితం చేయకుండా చూసుకుంటాడు. ఆహారంలో ఎక్కువ భాగం చికెన్, ఉడికించిన గుడ్లు ఉంటాయి. ఇష్టమైన వ్యాయామాలు స్క్వాట్‌లు, డెడ్ లిఫ్ట్‌లు, డంబెల్ ప్రెస్, కార్డియో ఉంటాయి. ఇది కాకుండా, ఫుట్‌బాల్, స్క్వాష్ ఫుట్‌వర్క్‌ను వేగవంతం చేస్తాయి.

3. డ్వేన్ బ్రావో – 38 ఏళ్ల వయస్సులోనూ తుఫాన్ ఇన్నింగ్స్‌లే..

కరీబియన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా 38 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడనున్నాడు. మెగా వేలంలో అతడిని జట్టు రూ. 4.40 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2021లో CSK నాల్గవ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. బ్రావో 11 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.

బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో మంచి ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. బ్రావో డెత్ ఓవర్లలో తక్కువ పరుగులను ఇస్తుంటాడు. లోయర్ ఆర్డర్‌లో కూడా బాగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.

ఫిట్‌నెస్- బ్రావో… డీజే బ్రావోగా ఫేమస్ అయ్యాడు. అతను తన ఫిట్‌నెస్ కోసం సంగీతం, నృత్యాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకుంటాడు. బ్రావో ధూమపానం లేదా మద్యపానానికి దూరంగా ఉంటాడు. అలాగే డ్రగ్స్‌కు దూరంగా ఉంటాడు.

4. ఫాఫ్ డు ప్లెసిస్ – గతేడాది 600 ప్లస్ పరుగులు

గత ఏడాది IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న డు ప్లెసిస్ 16 మ్యాచ్‌లలో 45.21 సగటుతో 633 పరుగులు చేసి అత్యధిక పరుగుల పరంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవ‌ల ఫామ్ చూస్తుంటే ఈసారి కూడా అత‌ని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వ‌చ్చాయ‌ని భావిస్తున్నారు.

ఫిట్‌నెస్- ఫాఫ్‌కి జిమ్ అంటే చాలా ఇష్టం. అతని ఫిట్ బాడీ రహస్యం రోజూ గంటల కొద్దీ వ్యాయామం చేయడమేనని అంటుంటాడు. కరోనా కాలంలో, డుప్లెసిస్ జంపింగ్ రోప్ ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకున్నాడు. అతను జిమ్ పట్ల మక్కువ కలిగి ఉంటాడు. తన రోజువారీ సెషన్‌ను ఎప్పటికీ మిస్ చేయడు. అందుకే అతని ఆట ప్రపంచమంతటా మాట్లాడుతుంది.

5. మహ్మద్ నబీ – గేమ్ ఛేంజింగ్ ఆల్ రౌండర్

అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ ఐపీఎల్-15లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు. KKR అతన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. నబీ వయస్సు 37 సంవత్సరాలు, కానీ అతను ఇప్పటికీ చాలా చురుకైనవాడిగా నిరూపించుకుంటున్నాడు. నబీ తన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు కూడా పేరుగాంచాడు.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో బంతితో, బ్యాటింగ్‌తో సందడి చేశాడు. నబీ అనుభవజ్ఞుడైన ఆటగాడు. కోల్‌కతా తరపున గేమ్ ఛేంజర్ అని నిరూపించగలడు.

ఫిట్‌నెస్- హార్డ్ జిమ్ చేయడంలో బీజీగా ఉంటాడు. మ్యాచ్ రోజుల్లో కూడా శిక్షణ కోసం సమయం వెచ్చిస్తుంటాడు. మహ్మద్ నబీ చాలా క్రమశిక్షణ కలిగిన క్రికెటర్‌గా పేరుగాంచాడు. అతను వ్యాయామం చేసిన తర్వాతే మైదానంలో ఆడటానికి వస్తాడు.

Also Read: INDW vs BANW: బంగ్లాపై భారత్ భారీ విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. ఆకట్టుకున్న స్నేహ్ రాణా, భాటియా

Womens World Cup 2022: విజయం దిశగా టీమిండియా.. కీలక మ్యాచులో మంధాన స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?