IND vs BAN, Women’s World Cup 2022: బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. బంగ్లా టార్గెట్ 230.. మిథాలీ సేన ఓడితే సెమీస్ కష్టమే
టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచులో బౌలర్లు సత్తా చాటకుంటే మాత్రం మిథాలీ సేనకు పరాజయం తప్పదు.
మహిళల ప్రపంచ కప్(Women’s World Cup 2022) 22వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్(IND vs BAN) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచులో బౌలర్లు సత్తా చాటకుంటే మాత్రం మిథాలీ(Mithali Raj) సేనకు పరాజయం తప్పదు. ఇక టీమిండియా తరపున పూజా వస్త్రాకర్ 30, గోస్వామి 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మంధాన 30, వర్మ 42 పర్వాలేదనిపించారు. 50 పరుగులు చేసిన తర్వాత యస్తిక పెవిలియన్ చేరింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యాస్తికా భాటియా అద్భుతంగా ఆడింది. ప్రస్తుత టోర్నీలో ఆమె ఔటయ్యే ముందు వరుసగా రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసింది. యాస్తికా వికెట్ రీతూ మోని ఖాతాలో చేరింది. యాస్తికా క్యాచ్‌ను నహిదా అక్తర్ షార్ట్ ఫైన్ వద్ద అందుకుంది.
యాస్తిక (50) వన్డే క్రికెట్‌లో మూడో అర్ధ సెంచరీ..
ఇది యాస్తికకు వరుసగా రెండో అర్ధశతకం. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 59 పరుగులు చేసింది. ఈ డబ్ల్యూసీలో యాస్తికా 5 ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు చేసింది. ఇక ఫాంలో ఉన్న మరో బ్యాటర్ హర్మన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయింది. దాంతో నాలుగో వికెట్ రూపంలో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఔటయ్యింది. 33 బంతుల్లో 14 పరుగులు చేసి హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా హర్మన్‌ప్రీత్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశించింది. కానీ ఆమె ఈసారి అభిమానులను నిరాశపరిచింది.
హర్మాన్ వికెట్ తర్వాత, రిచా ఘోష్, యాస్తిక్ భాటియా 5వ వికెట్‌కు 69 బంతుల్లో 54 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న రిచా 36 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 90 బంతుల్లో 74 పరుగులు జోడించారు. భారత స్టార్ ఓపెనర్ మంధాన ఈ మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో తన 5,000 పరుగులను పూర్తి చేసింది. స్మృతి, షెఫాలీల జోడీ నెమ్మదిగా భారత ఇన్నింగ్స్‌ను పునర్మించడంతో.. బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో బంగ్లా 5 బంతుల్లో టీమిండియా కీలకమైన మూడు వికెట్లు తీసి ఒక్కసారిగి మ్యాచ్‌ను మలుపుతిప్పారు.
స్పెషల్ రికార్డులు..
స్మృతి మంధాన: 5,000 పరుగులు పూర్తి చేసిన తర్వాత, స్మృతి తన ఇన్నింగ్స్‌ను పెద్దగా పొడిగించలేకపోయింది. 51 బంతుల్లో 30 పరుగుల వద్ద నహిదా అక్తర్ చేతిలో ఔటైంది.
షెఫాలీ వర్మ: రీతూ మోని బౌలింగ్‌లో షెఫాలీ వర్మ పెవిలియన్ చేరింది. 42 బంతుల్లో 42 పరుగుల వద్ద షెఫాలీ ఔటైంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా వికెట్ల వెనుక స్టంపౌట్ చేసింది.
మిథాలీ రాజ్: షెఫాలీ వికెట్ తర్వాత, రీతూ మోని తర్వాతి బంతికి భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను సున్నాకి అవుట్ చేయడం ద్వారా భారత్‌కు భారీ షాక్ ఇచ్చింది. మిథాలీ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్‌లో ఫాహిమా ఖాతూన్ అందుకుంది.
మంధాన (5013) అంతర్జాతీయ క్రికెట్‌లో 5,000 పరుగులు చేసిన మూడో భారత మహిళా క్రీడాకారిణిగా పేరుగాంచింది. మొదటి స్థానంలో మిథాలీ రాజ్, రెండవ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచారు. స్మృతి మంధాన (30) బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.
– మిథాలీ రాజ్ వన్డేల్లో 7వ సారి సున్నాకే ఔటైంది.
– ఈ ప్రపంచకప్‌లో షెఫాలీ వర్మ (42) అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.
పూనమ్ రీఎంట్రీ..
ఈ మ్యాచ్‌లో లెగ్‌బ్రేక్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్లేయింగ్ 11లో పునరాగమనం చేసింది. మేఘనా సింగ్ స్థానంలో ఆమెకు అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో పూనమ్‌కి ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు ఆడిన 57 వన్డేల్లో 79 వికెట్లు పడగొట్టింది. అదే సమయంలో ఆమె ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసింది.
రెండు జట్లు- భారత్ : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
బంగ్లాదేశ్: షర్మిన్ అక్తర్, ముర్షిదా ఖాతూన్, ఫర్గానా హోక్, నిగర్ సుల్తానా (కెప్టెన్), రుమానా అహ్మద్, రీతు మోని, లతా మండల్, సల్మా ఖాతూన్, నహిదా అక్తర్, ఫాహిమా ఖాతూన్, జహనారా ఆలం.
Also Read: PAK vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. పాక్‌తో వన్డే సిరీస్‌కు కీలక ప్లేయర్ దూరం..