KKR vs MI IPL 2022 Match Prediction: హ్యాట్రిక్ ఓటమి అంచున ముంబై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Kolkata Knight Riders vs Mumbai Indians Live Streaming: రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పైచేయి సాధించింది.

KKR vs MI IPL 2022 Match Prediction: హ్యాట్రిక్ ఓటమి అంచున ముంబై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Kkr Vs Mi Ipl 2022
Follow us

|

Updated on: Apr 05, 2022 | 2:53 PM

Kolkata Knight Riders vs Mumbai Indians Preview: ఐపీఎల్ 2022(IPL 2022) 14వ మ్యాచ్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(KKR vs MI) ఏప్రిల్ 6న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పోటీపడనున్నాయి. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పట వరకు విజయాల ఖాతాను తెరవలేదు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఫుల్ ఫాంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై హోమ్ బౌలర్లు తమ సత్తా చాటాల్సి ఉంటుంది. పాత రికార్డులు ముంబైకి అనుకూలంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కేకేఆర్‌పై 22 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. అయితే, కేకేఆర్ మాత్రం ఏడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఈ కోణంలో కోల్‌కతా పాత లెక్కలను మరిచిపోయి ముంబైని ఓడించేందుకు బరిలోకి దిగనుంది.

ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో 23 పరుగుల తేడాతో ఓడింది. కేకేఆర్‌పై విజయాన్ని నమోదు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ అనేక రంగాల్లో మెరుగవ్వాలనుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్న KKR జట్టు ఈ మ్యాచ్‌లో మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ బాసిల్ థంపి, స్పిన్నర్ మురుగన్ అశ్విన్ ముంబై తరపున బలహీనంగా కనిపించారు. థంపి ఒక ఓవర్‌లో 26 పరుగులు, అశ్విన్ మూడు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చారు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డేనియల్ సామ్స్ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో పరుగులు ఇచ్చి వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. KKR బ్యాట్స్‌మెన్‌లను అరికట్టడానికి ముగ్గురూ సరైన లైన్, లెంగ్త్ నుంచి బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

బుమ్రాకు మరో ఎండ్ నుంచి సహాయం కావాలి..

జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి తగినంత మద్దతు లభించడం లేదు. రోహిత్ కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందడానికి తన అభిమాన ప్రత్యర్థిపై మళ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం ఇప్పటి వరకు బాగానే రాణించాడు. తొలి మ్యాచ్‌లో 81 పరుగులు, రెండో మ్యాచ్‌లో 54 పరుగులు చేశాడు. ముంబై భారీ స్కోరు చేయాలంటే రోహిత్, కిషన్‌లు శుభారంభం అందించాలి.

సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా?

వేలి గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన సూర్యకుమార్ యాదవ్‌.. తదుపరి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది. ఇది కాకుండా, అన్మోల్‌ప్రీత్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్ కూడా తమ పాత్రలను చక్కగా పోషించవలసి ఉంటుంది. మరి దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు ముంబై అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.

రస్సెల్ ఫామ్‌లోకి రావడం KKRకి పెద్ద ఉపశమనం..

KKR విషయానికి వస్తే, వారికి అత్యంత సానుకూల అంశం స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి ఫామ్‌లోకి రావడం. పంజాబ్ కింగ్స్‌కు వ్యతిరేకంగా, అతను తన సిక్సర్ల కొట్టే నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించాడు. దానిని అతను కొనసాగించాలనుకుంటున్నాడు. టాప్ ఆర్డర్‌లో అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. వీరిద్దరూ జట్టుకు శుభారంభం అందించాల్సి ఉంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే అతని నుంచి భారీ ఇన్నింగ్స్ అవసరం. అదే సామ్ బిల్లింగ్స్, నితీష్ రానాలకు వర్తిస్తుంది. KKR పేసర్ ఉమేష్ యాదవ్ ఇప్పటివరకు బాగా రాణిస్తున్నాడు. అయితే టిమ్ సౌతీ, శివమ్ మావిల నుంచి మద్దతు అవసరం. ఇది కాకుండా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల ఎనిమిది ఓవర్లు కూడా ముఖ్యమైనవి.

KKR vs MI, IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను ఎప్పుడు, ఎలా లైవ్ లేదా ఆన్‌లైన్‌లో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య IPL-2022 14వ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

IPL-2022 14వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 6న బుధవారం జరగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య IPL-2022 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

పుణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

రాత్రి 7 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య టాస్ జరగనుండగా, తొలి ఇన్నింగ్స్ రాత్రి 07:30 గంటలకు ప్రారంభమవుతుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడగలను?

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇది కాకుండా, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్‌ను tv9telugu.comలో కూడా చదవొచ్చు.

ముంబై, కోల్‌కతా జట్ల వివరాలు..

కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, అభిజిత్ తోమర్, అజింక్యా రహానే, బాబా ఇందర్‌జిత్, నితీష్ రాణా, ప్రథమ్ సింగ్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అశోక్ శర్మ, పాట్ కమిన్స్, రసిక్ దార్, శివమ్ మావి, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్ చక్రవర్తి, అమన్ ఖాన్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, చమిక కరుణరత్నే, మహమ్మద్ నబీ, రమేష్ కుమార్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్ , రిలే మెరెడిత్, తమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ , ఇషాన్ కిషన్.

Also Read: IPL 2022: ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాట్స్‌మెన్‌గా మారనున్న విరాట్ కోహ్లీ.. స్పెషల్ రికార్డుకు ఒక అడుగు దూరంలో..

RR vs RCB, IPL 2022: బెంగళూరుకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన స్పిన్‌ ద్వయం.. హార్డ్‌ హిట్టర్ల భరతం పట్టేలా ప్రణాళికలు..

Latest Articles