AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనంటే టీమిండియా కుర్రాళ్ళకు హడల్.. కోహ్లీ, కుంబ్లే వివాదానికి అసలు కారణం చెప్పేసిన కాగ్ మాజీ చీఫ్..!

Virat Kohli vs Anil Kumble: మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య నెలకొన్న వివాదంపై మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ తన పుస్తకంలో కీలకంగా ప్రస్తావించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ తర్వాత అనిల్ కుంబ్లే టీమ్ ఇండియా కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆయనంటే టీమిండియా కుర్రాళ్ళకు హడల్.. కోహ్లీ, కుంబ్లే వివాదానికి అసలు కారణం చెప్పేసిన కాగ్ మాజీ చీఫ్..!
Virat Kohli Vs Anil Kumble
Venkata Chari
|

Updated on: Apr 05, 2022 | 3:35 PM

Share

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat kohli), టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(anil kumble) మధ్య వివాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి, అనిల్ కుంబ్లే మధ్య జరిగిన వివాదాన్ని భారత అభిమానులు మరిచిపోలేరు. తాజాగా, ఈ వివాదంపై మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్(former cag cheif vinod rai) తన పుస్తకంలో అప్పటి టీం ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వివాదానికి సంబంధించి మరో కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో వినోద్ రాయ్ భారత క్రికెట్‌ను నిర్వహించే బాధ్యతను స్వీకరించారు. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CoA) చీఫ్ వినోద్ రాయ్‌ను సుప్రీంకోర్టు 30 జనవరి 2017న నియమించింది. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లిల మధ్య తలెత్తిన వివాదం గురించి ఆయన తన పుస్తకం ‘నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్‌మెన్ – మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ’లో బహిరంగంగా రాశారు. ఈమేరకు ఇద్దరు అనుభవజ్ఞుల మధ్య అభిప్రాయ భేదాలను అందులో బయటపెట్టాడు. ఈ పరిస్థితిని మెరుగైన మార్గంలో పరిష్కరించవచ్చని కూడా పేర్కొన్నాడు.

అనిల్ కుంబ్లే క్రమశిక్షణతో ఉండేవాడు..

ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య ఉన్న సంబంధాన్ని ఏ విధంగానూ మెరుగ్గా పరిగణించలేమని వినోద్ రాయ్ ఈ పుస్తకంలో తెలిపాడు. ఈ వివాదాల మధ్య, అతను తన కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంభాషణ గురించి కూడా బహిరంగంగానే మాట్లాడాడు. కోచ్ అనిల్ కుంబ్లే మరింత క్రమశిక్షణతో ఉంటారని, దీని వల్ల జట్టులోని ఆటగాళ్లు సంతోషంగా లేరని తనకు తెలిసిందన్నారు.

యువ ఆటగాళ్లు భయపడ్డారు..

‘కుంబ్లే చాలా క్రమశిక్షణతో ఉన్నాడని, అందువల్ల కోచ్‌తో జట్టు సభ్యులు సంతోషంగా లేరని తెలిసింది. ఈ విషయంపై నేను విరాట్ కోహ్లితో మాట్లాడాను. అతను పని చేసే విధానాన్ని చూసి జట్టులోని యువ సభ్యులు భయపడ్డారనే విషయాన్ని కోహ్లీ తనతో చెప్పాడు. అయితే, ఈ విషయంపై అనిల్ కుంబ్లే కూడా సమాధానమిచ్చాడు. జట్టు అభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపాడు’ అని పుస్తకంలో పేర్కొన్నారు.

కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం చాలా విజయవంతమైందని ఆయన అన్నారు. తనతో జరిగిన సమావేశంలో కుంబ్లే కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. అతను తన పుస్తకంలో ఇలా రాశాడు, ‘కుంబ్లే ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మేము అతనితో చాలాసేపు మాట్లాడాం. మొత్తం ఎపిసోడ్‌ గురించి తెలుసుకున్నాం. దీంతో ఆయన కలత చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తమకు అన్యాయం జరిగిందని, కెప్టెన్ లేదా జట్టుకు అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని వారు అభిప్రాయపడ్డారని తెలిపాడు.

మాజీ CAG వినోద్ రాయ్ తన పుస్తకంలో కెప్టెన్, కోచ్ మధ్య వివాదం మధ్యలో, క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ (సౌరవ్ గంగూలీ, VVS లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్) ముగ్గురు సభ్యులు కూడా విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేతో సంభాషించారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 తర్వాత, ప్యానెల్ తదుపరి కోచ్‌ని ఎంచుకోవడానికి ప్లాన్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రవిశాస్త్రిని జట్టు కోచ్‌గా నియమించారు.

Also Read: KKR vs MI IPL 2022 Match Prediction: హ్యాట్రిక్ ఓటమి అంచున ముంబై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2022: ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాట్స్‌మెన్‌గా మారనున్న విరాట్ కోహ్లీ.. స్పెషల్ రికార్డుకు ఒక అడుగు దూరంలో..