KKR vs SRH IPL 2024 Final: చెన్నైలో హైఓల్టేజ్ ఫైట్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడేదెవరు..?

రెండు నెలలపాటు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది. ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌కి ఎండ్ కార్డు పడనుంది. టైటిల్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడతున్నాయి. ఈసారి కప్ గెలిచి ముద్దాడాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

KKR vs SRH IPL 2024 Final: చెన్నైలో హైఓల్టేజ్ ఫైట్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడేదెవరు..?
Kkr Vs Srh, Ipl 2024
Follow us

|

Updated on: May 26, 2024 | 8:09 AM

రెండు నెలలపాటు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది. ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌కి ఎండ్ కార్డు పడనుంది. టైటిల్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడతున్నాయి. ఈసారి కప్ గెలిచి ముద్దాడాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. హైవోల్ట్‌జ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. క్వాలిఫయర్‌-1లో కేకేఆర్‌ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్‌ ఎల్‌వెన్‌లో ఒకే మార్పు చేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ స్దానంలో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్ గ్లెన్‌ ఫిలిప్స్‌కు చోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసీజన్‌లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. అటు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో మార్‌క్రమ్ సింగిల్ రన్‌కే అవుటవడంతో ఫిలిప్స్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తోంది. అదే గాని జరిగితే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైనప్ మామూలుగా ఉండదు. ఇప్పటికే ఎస్ఆర్‌హెచ్‌ ఓపెనర్లు హెడ్, అభిషేక్‌ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో క్లాసన్‌ కి తోడు ఫిలిప్స్ చేరితే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్ లైనప్‌కి ఇక తిరుగుండదు. అటు బౌలింగ్ విభాగంలో కెప్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌, ఉనాధ్కాట్, షాబాజ్‌ అహ్మద్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టును విదేశీ కెప్టెన్లే నాలుగు సార్లు ఫైనల్‌కు చేర్చారు. అందులో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం.2009లో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, 2016లో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలో కప్ గెలిచారు. ఈసారి పాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్‌కి చేరారు.

కేకేఆర్ టీంలో నో ఛేంజ్

అయితే కోల్‌కత్తా టీం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కోల్‌కత్తా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ ఫైనల్‌కి ముందు ఫామ్‌లోకి రావడం KKRకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆ జట్టులోని ప్రతి ఒక్కరూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని కనుక కేకేఆర్‌ లో స్పిన్నర్లకు కొదవలేదు. SRHలో పోలిస్తే స్పిన్‌ దళంలో KKR ముందంజలో ఉందనే చెప్పాలి. సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తిలతో హైదరాబాద్‌ ఆటగాళ్లకు ముప్పు తప్పదు. రస్సెల్, నరైన్ లాంటి ఆల్‌రౌండర్లకు కొదవలేదు. ఇక కెప్టెన్ల విషయానికి వస్తే.. ఇంటర్ నేషనల్‌ కప్‌లను వరుసగా గెలిచిన అనుభవంతో ఎస్ఆర్‌ హెచ్‌ కెప్టెన్ కమిన్స్ ముందంజలో ఉన్నారు. ఫైనల్ గా కోల్‌కతా – హైదరాబాద్ ఇప్పటి వరకు 27సార్లు తలపడగా.. కేకేఆర్‌ 18, ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచుల్లో గెలిచాయి. అయితే ఈసారి కేకేఆర్ ఫైనల్‌కి చేరడంలో గంభీర్ పాత్ర కూడా ఉంది.

రెండుసార్లు కప్‌ గెలిచిన ఇరు జట్లు..

ఇప్పటికే ఇరుజట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నైలో సందడి చేశారు. చెన్నై బీచ్ లో, ఇతర ప్రాంతాల్లో కప్ తో సందడి చేశారు కెప్టెన్‌లు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చెపాక్ స్టేడియంలో కోల్‌కత్తా టీం ప్రాక్టీస్ చేయగా.. మొన్ననే క్వాలీఫయర్-2 మ్యాచ్‌ ఆడిన కారణంగా ఎస్ఆర్‌హెచ్‌ టీం ప్రాక్టీస్‌కి రెస్ట్ ఇచ్చింది. రెండు టీంల మధ్య గెలుపు అవకాశాలను ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ రెండు సార్లు కప్ గెలుచుకున్నాయి. ఈసారి ఏ టీం గెలిచిన మూడో సారి గెలిచిన రికార్డు సొంతం చేసుకుంటుంది. స్టేడియం రికార్డుల విషయానికి వస్తే.. ఇక్కడ గత 8 మ్యాచుల్లో ఆరుసార్లు ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. అయితే, దీంతో టాస్‌ నెగ్గే టీమ్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. అయితే, వర్షం పడే సూచనలూ ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. రిజర్వ్‌డే ఉంది. అప్పుడూ కూడా జరగకపోతే మాత్రం కోల్‌కతా విజేతగా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే కోల్‌కతాకే ఎక్కువ పాయింట్లు ఉండటం వల్ల కేకేఆర్‌కి కలిసొచ్చే అంశమని చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్