AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 3rd T20 : సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా పై విరుచుకుపడ్డ వాషింగ్టన్.. 3వ టీ20 గెలిచిన టీమిండియా

భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అసాధారణమైన పోరాటం, మెరుపు ఇన్నింగ్స్ (49 పరుగులు) ఈ విజయానికి కీలకంగా మారింది.

IND vs AUS 3rd T20 :  సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా పై విరుచుకుపడ్డ వాషింగ్టన్..  3వ టీ20 గెలిచిన టీమిండియా
Ind Vs Aus 3rd T20 (1)
Rakesh
|

Updated on: Nov 02, 2025 | 5:24 PM

Share

IND vs AUS 3rd T20 : భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అసాధారణమైన పోరాటం, మెరుపు ఇన్నింగ్స్ (49 పరుగులు) ఈ విజయానికి కీలకంగా మారింది. లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ తడబడినప్పటికీ, సుందర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జిత్ దేశ్ శర్మల సమష్టి కృషి ఫలితంగా భారత్ సిరీస్‌లో నిలబడగలిగింది. అంతకుముందు బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరిశాడు.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (3 వికెట్లు), వరుణ్ చక్రవర్తి (2 వికెట్లు) అద్భుతంగా రాణించారు. అర్ష్‌దీప్ మొదటి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ (6) వికెట్‌ను తీసి, ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (1) ను అవుట్ చేశాడు. వరుణ్ చక్రవర్తి కెప్టెన్ మిచెల్ మార్ష్ (11), మిచ్ ఓవన్‌లను అవుట్ చేశాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో టిమ్ డేవిడ్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి 74 పరుగుల (13వ ఓవర్ చివరి బంతికి ఔట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 186 పరుగుల స్కోరు అందించాడు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ తడబడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ పోరాటం వలన విజయం సాధ్యమైంది.

భారత్ 33 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (25) వికెట్‌ను, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (15) వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24) , తిలక్ వర్మ (29) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు.

వాషింగ్టన్ సుందర్ కేవలం 23 బంతులు ఎదుర్కొని, 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు (నాటౌట్) చేసి, మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. సుందర్‌కు జిత్ దేశ్ శర్మ (నాటౌట్ 22 పరుగులు) బాగా సహకరించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం టీమిండియాను విజయానికి చేర్చింది. భారత జట్టు 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా నిలబడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ