Karun Nair : రంజీ ట్రోఫీలో రికార్డు ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీతో బీసీసీఐకి గట్టి జవాబు ఇచ్చిన కరుణ్ నాయర్
భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్న కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గోవాపై డబుల్ సెంచరీని మిస్ చేసుకున్న కరుణ్ నాయర్, తాజాగా కేరళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను డబుల్ సెంచరీగా మలచడంలో విజయం సాధించాడు.

Karun Nair : భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్న కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గోవాపై డబుల్ సెంచరీని మిస్ చేసుకున్న కరుణ్ నాయర్, తాజాగా కేరళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను డబుల్ సెంచరీగా మలచడంలో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ మొదటి రోజు సెంచరీ చేసి నాటౌట్‌గా ఉన్న కరుణ్ నాయర్, రెండో రోజు ఆటలో ఏకంగా 233 పరుగులు చేసి బీసీసీఐ సెలక్టర్లకు తన బ్యాట్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు త్రిపుల్ సెంచరీ చేసినా జట్టులో స్థానం కోల్పోయిన ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్, తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు.
కర్ణాటకకు చెందిన సీనియర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్, రంజీ ట్రోఫీ 2025-26 లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ తాజాగా డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో మంగళాపురం వేదికగా కర్ణాటక, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ మొత్తం 389 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లు, 2 సిక్సర్లతో సహా 233 పరుగులు సాధించాడు.
కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చినప్పుడు కర్ణాటక జట్టు కష్టాల్లో ఉంది. కేవలం 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కర్ణాటక జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అక్కడ నుంచి ఇన్నింగ్స్‌ను నిదానంగా నిర్మించిన కరుణ్, 358 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగుల మార్కును చేరుకున్నాడు. గత మ్యాచ్‌లో గోవాపై నాటౌట్‌గా 174 పరుగులు చేసిన కరుణ్ నాయర్, అంతకు ముందు మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ యువ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్‌తో కలిసి ఏకంగా 338 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌తో పాటు స్మరణ్ కూడా సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. దేశీయ క్రికెట్‌లో ఈ విధంగా నిలకడగా భారీ పరుగులు సాధించడం ద్వారా, తిరిగి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవాలని కరుణ్ నాయర్ ఆశిస్తున్నాడు.
కరుణ్ నాయర్‌కు భారత జట్టులో గతంలో ఆశించిన ఫలితం దక్కలేదు. గత రంజీ సీజన్‌లో సెంచరీల మీద సెంచరీలు కొట్టినందుకు గాను, దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత అతడికి ఇంగ్లాండ్ పర్యటన కోసం టెస్ట్ జట్టులో అవకాశం దక్కింది. అయితే, అతడికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్కసారి 50 పరుగుల మార్కును దాటాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా సెలక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు.




