AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND-W vs SA-W Final: వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా…ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదే!

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం, తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా టాస్ జరిగింది. లారా వోల్వార్డ్ట్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుందామని భావించినట్లు తెలిపింది.

IND-W vs SA-W Final:  వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా...ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదే!
Ind W Vs Sa W
Rakesh
|

Updated on: Nov 02, 2025 | 4:58 PM

Share

IND-W vs SA-W Final: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం, తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా టాస్ జరిగింది. లారా వోల్వార్డ్ట్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుందామని భావించినట్లు తెలిపింది. ఈ కీలక ఫైనల్‌కు ఇరు జట్లు సెమీఫైనల్‌లో ఆడిన జట్టుతో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. భారత్ మూడోసారి ఫైనల్ ఆడుతుండగా, దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి ఫైనల్.

నవీ ముంబైలో కురిసిన భారీ వర్షం, తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ టాస్ దాదాపు రెండు గంటలు ఆలస్యమైంది. మధ్యాహ్నం 2:30 గంటలకు జరగాల్సిన టాస్, ఆలస్యంగా జరిగింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, తాము కూడా మొదట బౌలింగే చేయాలనుకున్నామని తెలిపింది. ఎందుకంటే ఆకాశం మేఘావృతమై ఉండటంతో పిచ్ నుంచి బౌలర్లకు సహాయం లభించే అవకాశం ఉంది.

అయితే, ఇప్పుడు బ్యాటింగ్ చేయాల్సి వచ్చినందున, మంచి ఆరంభాన్ని ఇచ్చి, మంచి స్కోరును బోర్డుపై పెట్టడానికి ప్రయత్నిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. 5-6 ఓవర్ల తర్వాత పిచ్ నుంచి బౌలర్లకు ఎక్కువ సహాయం లభించకపోవచ్చని ఆమె అంచనా వేసింది. ఈ కీలక ఫైనల్‌కు ఇరు జట్లు సెమీఫైనల్‌లో ఆడిన కాంబినేషన్‌తోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. సెమీఫైనల్ తర్వాత తమకు రెండు రోజుల విశ్రాంతి లభించిందని, జట్టు సభ్యులందరూ ఫైనల్ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని హర్మన్ తెలిపారు.

సౌతాఫ్రికా సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా, భారత జట్టు ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు వచ్చింది. భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడటం ఇది మూడోసారి (గతంలో 2005, 2017లో ఆడింది). సౌతాఫ్రికా జట్టుకు ఇదే మొదటి వరల్డ్ కప్ ఫైనల్. ఈ రెండు జట్లు లీగ్ స్టేజ్‌లో తలపడగా, ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచి భారత్‌కు షాక్ ఇచ్చింది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI సౌతాఫ్రికా మహిళల ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, ఎనెకే బోష్, సునే లూస్, మరిజాన్ కాప్, సినాలో జాఫ్టా (వికెట్ కీపర్), ఎనెరీ డర్క్సెన్, క్లో ట్రయాన్, నదీన్ డి క్లర్క్, అయబొంగా ఖాకా, నాన్కుల్లులేకో మ్లాబా,

భారత మహిళల ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..