Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. పట్టుమని 12 పరుగులు కూడా చేయలే.. రంజీలోనూ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ షో

Virat Kohli Ranji Trophy Flop Performance: విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులకే ఔట్ అయ్యాడు. అభిమానులు అతనిని చూసేందుకు పెద్దసంఖ్యలో స్టేడియానికి వచ్చినా, పేలవమైన ప్రదర్శనతో కోహ్లీ ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చిన కోహ్లీ, రెడ్ బాల్ క్రికెట్‌లో తన పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు. కోహ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. పట్టుమని 12 పరుగులు కూడా చేయలే.. రంజీలోనూ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ షో
Virat Kohli Flop Show
Follow us
Venkata Chari

|

Updated on: Jan 31, 2025 | 12:16 PM

Virat Kohli Flop Performance: రంజీ ట్రోఫీ 2024-25 ఏడవ రౌండ్ జనవరి 30 నుంచి ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో 16 మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మ్యాచ్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. విరాట్‌ ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అభిమానులు అరుణ్‌జైట్లీ స్టేడియానికి వచ్చినా, చివరి సెషన్‌లో ఢిల్లీ బ్యాటింగ్‌ చేసినందున కోహ్లీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం వారికి లభించలేదు. అయితే, రెండో రోజు అభిమానులు పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడంతో విరాట్ బ్యాటింగ్‌కి వచ్చినా ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయాడు. రెడ్ బాల్‌లో అతని పేలవమైన ఫామ్ కొనసాగిం. కేవలం 6 పరుగులు చేసిన తర్వాత రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు బలి అయ్యాడు.

హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్..

ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మ్యాచ్ రెండో రోజు ఉదయం నుంచి విరాట్ కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. 24వ ఓవర్లో యశ్ ధుల్ వికెట్ పడగానే అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. విరాట్ ప్రారంభంలో కొన్ని బంతులు ఆడాడు. అవకాశం వచ్చినప్పుడు పరుగులు కూడా చేశాడు. ఆ తర్వాత హిమాన్షు సాంగ్వాన్‌పై 28వ ఓవర్ మూడో బంతికి అతను ఫోర్ బాదడంతో అభిమానులు ఆనందంతో గంతులేశారు.

అయితే, అభిమానుల ఆనందం తర్వాతి బంతికే దుఃఖంగా మారింది. హిమాన్షు కోహ్లీ స్టంప్‌లను ఎగరగొట్టాడు. ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన తర్వాత, హిమాన్షు చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. స్టేడియంలో నిశ్శబ్దం నెలకొంది. కోహ్లి తన ఇన్నింగ్స్‌లో 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సహాయంతో 6 పరుగులు చేశాడు. విరాట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను స్టేడియంలో ఫ్యాన్స్‌ని అలరిస్తాడని భావిస్తున్నారు.

12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి..

విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అతను చివరిసారిగా నవంబర్ 2012లో ఢిల్లీ తరపున ఒక మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియా కోసం ఆడుతున్నట్లు కనిపించాడు. కానీ, తన సొంత జట్టు కోసం రంజీ ఆడలేదు. అయితే, కొత్త బీసీసీఐ నిబంధన ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నప్పుడల్లా దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి. అందుకే కోహ్లి కూడా ఆడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..