Team India: ‘ఆ సిరీస్‌తో 28 ఏళ్ల బౌలర్ కెరీర్ క్లోజ్.. మరోసారి ఎంట్రీ కష్టమే’
Ashwin Key Comments on Akash Deep Future in Team India: ఆస్ట్రేలియాలో ఫ్లాప్ తర్వాత, టీమిండియా యువ బౌలర్‌కు ఇకపై టెస్టుల్లో అవకాశం లభించదని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్‌కు విఫలమైతే ఇలా జరిగేది కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Team India Pacer Akash Deep Future Ashwin Analysis: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లు తీసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. మరోవైపు యువ బౌలర్ ఆకాశ్ దీప్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ వికెట్ల పరంగా వెనుకంజలోనే నిలిచాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆకాష్ ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. దీని కారణంగా అతనికి టీమిండియాలో మళ్లీ అవకాశం లభించడం కష్టమని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అయితే, బ్యాట్స్‌మెన్‌లకు మాత్రం వేరేలా ట్రీట్ చేస్తుంటారు అంటూ అశ్విన్ ఉద్ఘాటించాడు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి ఆకాష్ దీప్ మూడవ ఫాస్ట్ బౌలర్‌గా పనిచేశాడు. అయితే, అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో ఆకాష్ విఫలమయ్యాడు. ఇప్పుడు అతడికి సంబంధించి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చాడు.
బెంగళూరులో జరిగిన AWS AI కాంక్లేవ్ 2025లో అశ్విన్ మాట్లాడుతూ, ‘ఇది అన్యాయమైన ప్రపంచం. బ్యాట్స్‌మెన్ ప్రయోజనం పొందుతారు. కానీ, బౌలర్లు అలాకాదు. ఆస్ట్రేలియాలో తగినన్ని వికెట్లు పడకపోవడంతో ఆకాశ్ దీప్‌కు మరో టెస్టు ఆడే అవకాశం లభించకపోవచ్చు. కానీ, ఇలా బ్యాట్స్‌మెన్‌ని తప్పించడం చాలా అరుదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
గాయం కారణంగా 28 ఏళ్ల ఆకాష్ కెరీర్ కూడా దెబ్బతింది. 2019లో బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి వెన్ను గాయం తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ అధికారి కొద్ది రోజుల క్రితం చెప్పారు. అతని కెరీర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ, బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ‘ఆకాష్ వయస్సులో, అతను పదేపదే గాయాల కారణంగా ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పుకుంటే, అతనికి సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ నడిపించడం కష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆకాష్ ఇప్పటివరకు టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్ మాత్రమే ఆడాడు. 2024లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఆకాష్ 7 టెస్టుల్లో 15 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 83/3. అయితే, అతని సగటు 35 కంటే ఎక్కువ. ఆకాష్ ఆస్ట్రేలియాలో రెండు టెస్టులు (బ్రిస్బేన్, గబ్బా) ఆడాడు. అందులో అతను 5 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..