Video: ఫ్యామిలీతో రోహిత్ సెలబ్రేషన్స్.. కట్‌చేస్తే.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ.. ఏంచేసిందో తెలుసా?
Anushka Sharma Hugs Rohit Sharma: భారత జట్టు విజయం తర్వాత అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కౌగిలించుకుని, అభినందించింది. ఈ సమయంలో రోహిత్ శర్మ రితికతో ఉన్నాడు. రోహిత్ శర్మ కూతురు కూడా అతనితో పాటు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Anushka Sharma Hugs Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. విజయం తర్వాత అనుష్క శర్మ విరాట్ కోహ్లీతోపాటు, రోహిత్ శర్మను అభినందించి, కౌగిలించుకుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. భారత విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించి 76 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. భారత జట్టు ఇక్కడ 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మతోపాటు శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులు చేసి మద్దతు ఇచ్చారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి 45 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 40 పరుగులకు 2 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ జట్టు మొత్తం 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.
రోహిత్‌ను కౌగిలించుకున్న అనుష్క శర్మ..
rohit and anushka together pic.twitter.com/jvfQA1vMjf
— Nush (@kyayaarcheeks) March 9, 2025
ఈ క్రమంలో ఒక అభిమాని సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో రోహిత్ శర్మ తన భార్య రితిక, కుమార్తెతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ భార్య కూడా అక్కడే ఉంది. విరాట్ భార్య రోహిత్ శర్మను కౌగిలించుకుని, అభినందించింది.
ఇది చదవండి: సచిన్ నుంచి ధోని వరకు.. బీసీసీఐ నుంచి అత్యధిక పెన్షన్ అందుకునేది ఎవరు?
విజయం తర్వాత రోహిత్ ఏం చెప్పాడంటే?
టీం ఇండియాను విజయపథంలో నడిపించిన తర్వాత, రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., ఈ ట్రోఫీ, విజయానికి క్రెడిట్ మన గెలుపును చూడాలనుకునే దేశ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ట్రోఫీ విజయం వారందరికీ సొంతం అంటూ ఫ్యాన్స్‌కు మంచి బహుమతిని అందించాడు.
టీం ఇండియా విజయం తర్వాత, రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రస్తావిస్తూ, ఈ పరిస్థితుల్లో మేం గొప్ప పని చేశాం, పరిస్థితులకు అనుగుణంగా మారడంలో విజయం సాధించాం అని అన్నాడు. బ్యాట్స్‌మెన్ గొప్ప పని చేశారు. కానీ, భారత జట్టు సెలెంట్ హీరో శ్రేయాస్ అయ్యర్‌ను మర్చిపోకూడదు. ఇది మంచి అనుభూతి, నేను పెద్దగా చెప్పనవసరం లేదు, ఏం చేయాలో అతనికి తెలుసు. బౌలర్లు కూడా ఇతర జట్లను 240-250కి పరిమితం చేయడం ద్వారా బాగా రాణించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
టీమిండియా గురించి మాట్లాడుకుంటే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. 2024 సంవత్సరంలో, టీం ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో, ధోని తర్వాత భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత, జూన్ నెలలో ఇంగ్లాండ్ పర్యటనలో టీం ఇండియా ఆటగాళ్ళు టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..