సచిన్ నుంచి ధోని వరకు.. బీసీసీఐ నుంచి అత్యధిక పెన్షన్ అందుకునేది ఎవరు?

TV9 Telugu

06 March 2025

క్రికెట్‌ను మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, క్రికెట్ పట్ల ఎక్కువ క్రేజ్ భారతదేశంలోనే కనిపిస్తుంది. 

భారత క్రికెటర్లను వారి అభిమానులు ఎంతో ప్రేమిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా బీసీసీఐ తన రిటైర్డ్ ఆటగాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసుకుందాం..

ఈ లిస్టులో చాలామంది మాజీ క్రికెటర్లు ఉన్నారు. అయితే, వీరిలో బాగా పాపులర్ అయిన ఐదుగురు క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి పేరు సునీల్ గవాస్కర్. బీసీసీఐ అతనికి నెలకు రూ. 70,000 పెన్షన్ ఇస్తుంది. కనీసం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వారికి మాత్రమే BCCI పెన్షన్ ఇస్తుంది.

క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ పేరు రెండవ స్థానంలో ఉంది. బీసీసీఐ టెండూల్కర్‌కు రూ.70 వేల పెన్షన్ కూడా ఇస్తుంది.

ఈ జాబితాలో మూడో పేరు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోనికి బీసీసీఐ రూ.70,000 పెన్షన్ కూడా అందిస్తుంది.

భారత మాజీ జట్టు ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఎడమ చేతితో బౌలింగ్ చేసి, ఎడమ చేతితో బ్యాటింగ్ చేసేవాడు. పఠాన్‌కు బీసీసీఐ రూ.60 వేల పెన్షన్ ఇస్తుంది.

భారత జట్టు డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ 2022 సంవత్సరంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, బీసీసీఐ అతనికి ప్రతి నెలా రూ. 60,000 పెన్షన్ ఇస్తుంది.