Video: నేను ఒప్పుకోను.. డ్యాన్స్ చేయాల్సిందే.. గంభీర్ సైగలతో జైషాను స్టెప్పులేయించిన రోహిత్..
Jay Shah and Rohit Sharma Dance Video: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఆటగాళ్లంతా డ్యాన్స్‌లతో సందడి చేశారు. ఈ క్రమంలో రోహిత్ చెంతకు వచ్చిన ఐసీసీ ఛైర్మన్ జైషా కూడా సంతోషంతో కనిపించాడు. గంభీర్ సైగలతో రోహిత్ శర్మ జైషాతో స్టెప్పులేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Jay Shah and Rohit Sharma Dance Video: భారత కెప్టెన్ రోహిత్ శర్మ మార్చి 9 ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఘనతను సాధించాడు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం ఇండియాకు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో భారత జట్టుకు చాలా మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ టీం ఇండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. తన అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ ఆడుతున్న తీరు చూసి, అతను ఖచ్చితంగా సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా తక్కువ పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినప్పటికీ, టీం ఇండియా న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది. అభిమానులతో పాటు, ఐసీసీ చైర్మన్ జే షా కూడా భారత విజయంపై సంతోషించారు. ఈ క్రమంలో ఆనందం తట్టుకోలేకపోయిన జైషా.. రోహిత్, గంభీర్‌లను కౌగిలించుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, గంభీర్ సైగ చేయడంతో.. రోహిత్ జైషాను స్టెప్పులేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైషాతో స్టెప్పులేయించిన రోహిత్ శర్మ..
Captain Rohit Sharma, coach Gautam Gambhir and ICC chairman Jay Shah.#ChampionsTrophy2025 #ChampionsTrophy #ChampionsTrophyFinal #iccchampionstrophy2025 #ICCChampionsTrophy #RohitSharma #gautamgambhir #jayshah #INDvNZ #indiavsnewzeland #IndiaVsNewZealandfinal #ViratKohli #ICC pic.twitter.com/XfTsxBfYUn
— Uddeshya Mishra (@Uddeshya_03) March 9, 2025
భారత విజయంపై ఐసీసీ చైర్మన్ జై షా కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అతను స్టేడియంలో డ్యాన్స్ చేస్తూ ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. జై షా, రోహిత్ శర్మ ఒకరినొకరు కౌగిలించుకుని డ్యాన్స్ చేయడం, ఈ విజయాన్ని తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం వీడియోలో చూడొచ్చు. అభిమానులు కూడా ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు.
Rohit making jay shah to dance #ChampionsTrophy2025 #ChampionsTrophy #RohitSharma #jayshah pic.twitter.com/YEXPLjvPcM
— TajKeProperties (@Mawt777) March 9, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..