IND vs NZ: గ్రూపు దశ నుంచి విజేత వరకు.. కోట్ల వర్షం కురిపించిన ఐసీసీ.. ఏ జట్టుకు ఎంత వచ్చాయంటే?
Team India Prize Money: రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురిసింది. అలాగే, రన్నరప్ జట్టు కివీస్‌పైనా కోట్ల వర్షం కురిసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India Prize Money: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో, టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకుని, చరిత్ర సృష్టించింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2013 సంవత్సరం తర్వాత అంటే దాదాపు 12 ఏళ్లకు భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ విధంగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత టీమిండియాకు ఎన్ని కోట్లు వచ్చాయి, రన్నరప్ న్యూజిలాండ్ ఎన్ని కోట్లతో స్వదేశానికి తిరిగి వెళ్లింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్, న్యూజిలాండ్ జట్లపై కోట్ల వర్షం..
పాకిస్తాన్, దుబాయ్‌లలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌తోపాటు, ప్రైజ్ మనీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయల బహుమతిని పొందింది. అదే సమయంలో, టైటిల్ మ్యాచ్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టుకు 1.12 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బహుమతి లభించింది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఎన్ని కోట్లు సంపాదించాయి?
సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లకు 5 లక్షల 60 వేల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 4.8 కోట్ల రూపాయలు లభించాయి. ఈ రెండు జట్లు ఓటమి తర్వాత ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లలో, ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్లు, ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు రూ. 1 కోటి చొప్పున అందాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








