AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్‌ కోహ్లీ vs రోహిత్‌ శర్మ.. ఇద్దరి కెప్టెన్సీలో తేడా ఏంటి? వరుణ్‌ చక్రవర్తి, అశ్విన్‌ ఏం చెప్పారంటే..?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీని రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి విశ్లేషించారు. కోహ్లీని ఒక మోటివేషనల్ లీడర్‌గా, రోహిత్‌ను టాక్టికల్ లీడర్‌గా వర్ణించారు. కోహ్లీ ఆటగాళ్ల సామర్థ్యాన్ని నమ్ముకుంటే, రోహిత్ ప్రణాళికలతో ఆకట్టుకుంటాడని వారు పేర్కొన్నారు. ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లు అయినప్పటికీ, వారి శైలులలో తేడాలు ఉన్నాయని వారు తెలిపారు.

విరాట్‌ కోహ్లీ vs రోహిత్‌ శర్మ.. ఇద్దరి కెప్టెన్సీలో తేడా ఏంటి? వరుణ్‌ చక్రవర్తి, అశ్విన్‌ ఏం చెప్పారంటే..?
Virat Kohli Rohit Sharma
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 7:51 PM

Share

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇండియాన్‌ క్రికెట్‌లో బిగ్‌ స్టార్స్‌. కోహ్లీ అయితే ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా కీర్తి ప్రతిష్టతలు అందుకున్నాడు. ఈ ఇద్దరు కూడా టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించారు. రోహిత్‌ శర్మ ప్రస్తుతం వన్డే జట్టుగా కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 2024లో టీ20 వరల్డ్‌ కప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గింది. ఇక కోహ్లీ కెప్టెన్సీలో కప్పులు రాకపోయినా.. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప కెప్టెన్‌గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా టెస్టు క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా మారింది. అయితే.. ఈ ఇద్దరి కెప్టెన్సీ గురించి టీమిండియా స్పిన్నర్లు.. వరుణ్‌ చక్రవర్తి, రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడారు. అశ్విన్‌ ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అశ్విన్‌కు ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. అందులో వరుణ్‌ చక్రవర్తిని ఇంటర్వ్యూ చేస్తూ కోహ్లీ, రోహిత్‌ కెప్టెన్సీల మధ్య తేడా ఏంటని అడిగాడు.

అందుకు వరుణ్‌ సమాధానం ఇస్తూ.. విరాట్‌ కోహ్లీ ఒక నిజమైన లీడర్‌ అని ప్రశంసించాడు. కోహ్లీ జట్టు కోసం ఏం చేస్తాడో మనందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో మన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత.. కోహ్లీ అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ సిక్స్‌ కొట్టాడు. అది చాలా ఇంప్యాక్ట్‌ చూపించింది. ఇక కెప్టెన్‌గా మనలో జోష్‌ నింపుతాడు. అతనితో మాట్లాడిన ప్రతీ సారి ఎంతో మోటివేషనల్‌గా అనిపిస్తుంది. ఇక రోహిత్‌ శర్మ విషయానికి వస్తే కాస్త ట్యాక్టికల్‌గా ఉంటాడని వరుణ్‌ తెలిపాడు.

వరుణ్‌ అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ మోటివేట్‌ చేస్తే.. ట్యాక్టికల్‌ అంటే ప్రణాళికల విషయంలో కోహ్లీ కంటే రోహిత్‌ కాస్త మెరుగ్గా ఉంటాడంటూ అశ్విన్‌ పేర్కొన్నాడు. అంటే ఏ బ్యాటర్‌కు ఏ బాల్‌ వేయాలి, ఎలాంటి ఫీల్డ్‌ సెట్‌ చేయాలనే విషయాలను రోహిత్‌ శర్మ బాగా గ్రహిస్తాడని అశ్విన్‌ అన్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ తన ఆటతో ప్రాక్టీస్‌తో ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని పేర్కొన్నాడు. ఇద్దరు అద్భుతమైన కెప్టెన్లు అయినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ ఆటగాళ్ల సామర్థ్యాన్ని ఎక్కువగా నమ్మితే.. రోహిత్‌ ప్రణాళికలు అద్బుతంగా వేస్తాడని ఇద్దరూ అంగీకరించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్