AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! టీమిండియాకు ఒక తిరుగులేనట్టేనా..?

ఇంగ్లాండ్‌తో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉండటం టీం ఇండియాకు గుడ్ న్యూస్. అసిస్టెంట్ కోచ్ ధృవీకరించిన ఈ విషయం అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే, అతన్ని కచ్చితంగా ప్లేయింగ్లోకి తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! టీమిండియాకు ఒక తిరుగులేనట్టేనా..?
Team India
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 8:07 PM

Share

ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఒక అదిరిపోయే గుడ్‌ న్యూస్ అందింది. మన ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌ డస్కటే ధృవీకరించాడు. అయితే జూలై 2న ప్రారంభమయ్యే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బుమ్రా కచ్చితంగా ఆడతాడనే విషయంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. “అతను ఆటకు అందుబాటులో ఉన్నాడు. అయితే బుమ్రా ఐదు టెస్టుల్లో మూడు మాత్రమే ఆడతాడనే విషయం మాకు సిరీస్‌ ఆరంభానికే ముందే తెలుసు. తొలి టెస్ట్ నుండి కోలుకోవడానికి అతనికి ఎనిమిది రోజులు సమయం ఉంది. కానీ పరిస్థితులు, పనిభారం, తదుపరి నాలుగు ఆటలకు మేం బుమ్రాను ఎలా సిద్ధంగా ఉంచాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు,” అని టెన్ డక్కటే తెలిపాడు.

జూలై 2న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో బుమ్రా పూర్తి ఫిట్‌గా బౌలింగ్ చేస్తూ కనిపించాడు . ఈ స్పీడ్‌స్టర్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అతను తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో 43.4 ఓవర్లు వేసిన జస్‌ప్రీత్ బుమ్రా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే ఛాన్స్‌ ఉంది. కానీ భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో పాటు, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ నేతృత్వంలోని పేస్ అటాక్ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో బుమ్రాను ఆడించాల్సిందే అనే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది.

బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, గాయం గురించి ఎటువంటి ఆందోళనలు లేవని భారత అసిస్టెంట్ కోచ్ తాజాగా పేర్కొనడంతో ఒక రెండో టెస్టులో బుమ్రా ఆడటం ఖాయంగా కనిపిస్తోందని భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బుమ్రాకు సపోర్ట్‌గా సిరాజ్‌ కూడా వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి