AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. హమ్మయ్యా.. ఆ పేస్ పిచ్చోడు ఆడడం లేదులే

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ కు ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. అయితే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగే ఈ టెస్టులోనూ గెలవాలన్న ఇంగ్లండ్ తుది జట్టు ఎంపికలో సంచలన నిర్ణయం తీసుకుంది.

IND vs ENG: భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. హమ్మయ్యా.. ఆ పేస్ పిచ్చోడు ఆడడం లేదులే
India Vs England
Basha Shek
|

Updated on: Jun 30, 2025 | 9:54 PM

Share

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి 2 రోజులు మిగిలి ఉండగా, ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఎప్పటిలాగే రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా, కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్న అనుభవజ్ఞుడైన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ టెస్టుకు కూడా దూరమయ్యాడు. కొన్ని రోజుల క్రితం, ఇంగ్లాండ్ సెలెక్టర్లు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో జరిగే రెండో టెస్ట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఆర్చర్ రాక తో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం మరింత పదునెక్కుతుందని ఆ జట్టు భావించింది. అయితే మొదటి టెస్టులో అర్చర్ ఆడలేదు. అయినా ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ గెలిచింది. అయితే ఆ జట్టు పేసర్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. దీనిని సద్వినియోగం చేసుకున్న టీం ఇండియా బ్యాటర్లు ఏకంగా 5 సెంచరీలతో చెలరేగారు. దీంతో రెండో టెస్టులో అర్చర్ ను ఎలాగైనా బరిలోకి దింపాలని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ భావించింది.

అయితే ఆర్చర్ జట్టుకు దూరం కావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఆర్చర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందువల్ల, ఆర్చర్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత జోఫ్రా ఆర్చర్ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. వివిధ గాయాల సమస్యల కారణంగా, అతను ఎక్కువ కాలం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుతో కొనసాగలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ ఇతరత్రా కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఇంగ్లాండ్ జట్టు తమ ప్లేయింగ్ XIలో ఎటువంటి మార్పులు చేయలేదు. అంటే లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఉన్న అదే 11 మంది ఆటగాళ్లే రెండవ టెస్ట్‌లోనూ బరిలోకి దిగుతారు.

భారత్ తో రెండో టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..