టీమిండియాలోకి ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తొలి అంతర్జాతీయ ప్రత్యర్థి ఎవరో తెలుసా?
Vaibhav Sooryavanshi International Debut: ఐపీఎల్‌లో తన డేంజరస్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. అంచనాలను మించి రాణిస్తున్న ఈ పరుగుల వీరుడి తొలి అంతర్జాతీయ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ఈ యువ ఆటగాడికి మార్గం సుగమమైంది.

Vaibhav Sooryavanshi International Debut: ఐపీఎల్ 2025 సీజన్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తొలి సీజన్‌లోనే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 250కి పైగా పరుగులు సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. గత ఏడాది భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 175 పరుగులతో ప్రత్యర్థి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా కుప్పకూల్చాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్ వల్లే భారత్ ఆ మ్యాచ్‌లో 400కు పైగా భారీ స్కోరును నమోదు చేయగలిగింది.
సెకండ్ సీజన్ భయాలను పటాపంచలు చేస్తూ..
సాధారణంగా ఏ యువ ఆటగాడైనా రెండో సీజన్‌కు వచ్చేసరికి ప్రత్యర్థి జట్ల వీడియో విశ్లేషణల వల్ల తడబడటం చూస్తుంటాం. కానీ వైభవ్ మాత్రం ఐపీఎల్ 2026లో అంతకుమించి అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఓపెనర్ కేవలం 11 మ్యాచ్‌ల్లోనే 236.56 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 440 పరుగులు సాధించాడు. ఇందులో 40 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాది, ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యంత వేగవంతమైన సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు.
రవిశాస్త్రి ప్రశంసల జల్లు.. భారత్ ఆరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు..
వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌ను చూసి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. వైభవ్ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.. “ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి జట్టులోకి త్వరగా తీసుకురావడానికి టీ20 ఫార్మాట్ అత్యంత అనుకూలమైనది. వైభవ్ వయసు 14, 15 లేదా 16 ఏళ్లా అనేది నాకు అనవసరం. తనకంటే రెండింతలు వయసున్న బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. ప్రస్తుతం ప్రపంచంలోని ఏ జట్టులోనైనా అతడు సులువుగా చోటు సంపాదించగలడు” అని కొనియాడారు.
రాబోయే జూన్ నెలలో జరిగే ఐర్లాండ్ పర్యటన వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి సరైన వేదిక అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. భారత జట్టు ఐర్లాండ్‌లో రెండు టీ20లు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలోనే వైభవ్ భారత్ తరపున అత్యంత పిన్న వయస్కుడిగా బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్లేషించారు.
ఇండియా-ఏ జట్టుకు ఎంపిక.. తొలి అంతర్జాతీయ సమరం ఎవరితో అంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే వైభవ్‌ను సీనియర్ జట్టు వైపు నడిపించే ప్రక్రియను ప్రారంభించింది. తిలక్ వర్మ సారథ్యంలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా-ఏ జట్టులో వైభవ్‌కు చోటు లభించింది. జూన్ నెలలో జరగబోయే ఈ పర్యటనలో అఫ్గానిస్తాన్-ఏ జట్టుతో కూడిన వన్డే త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ విధంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కోబోయే తొలి ప్రత్యర్థిగా అఫ్గానిస్తాన్ లేదా శ్రీలంక ఖరారైంది.
సహజసిద్ధమైన బ్యాటింగ్ శైలి, భయం లేని ఆటతీరుతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు నూతన నక్షత్రంగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా-ఏ తరఫున శ్రీలంకలో జరిగే త్రైపాక్షిక సిరీస్‌లో అతడు రాణిస్తే, రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల ద్వారా సీనియర్ జట్టులో స్థానం దక్కించుకోవడం నల్లేరుపై నడకే అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
