Kohli vs BCCI: ఇది చాలా చిన్న సమస్య.. కోల్డ్‌వార్ ఆపితే భారత క్రికెట్‌కు మంచిది: మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir: దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ తన నాయకత్వాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకోవడంతో జట్టులో ఓ సభ్యుడిగా మాత్రమే ఉండనున్నాడు.
Virat Kohli vs BCCI:దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ ఓటమి తర్వాత 33 ఏళ్ల కోహ్లీ(Virat Kohli) తన నాయకత్వాన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ(BCCI), కోహ్లీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మూడు నెలల్లో మూడు కెప్టెన్సీలను వదులుకోవడంతో బీసీసీఐ కూడా కోహ్లీ నిర్ణయాలపై ఒకింత గుర్రుగానే ఉంది. దీంతో ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఫైరయ్యాడు. కోహ్లి అనాలోచిత నిష్క్రమణ బీసీసీఐతో అతని సంబంధాన్ని ప్రశ్నార్థకం చేసిందంటూ కామెంట్ చేశాడు. 2021 నవంబర్‌లో, కోహ్లీ టీ20ఐ నాయకుడిగా తన స్థానాన్ని వదులుకున్న ఒక నెల తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. కోహ్లి వీడ్కోలు తర్వాత భారత క్రికెట్‌లో వివాదాస్పద కాలం నడిచింది. భారత బోర్డు, అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కోహ్లీ మధ్య అంతర్లీన సమస్యను హైలైట్ చేసింది.
చాలా మంది మాజీలు కూడా ఈ సమస్యపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కోహ్లి, బీసీసీఐ మధ్య చీలిక అంత మంచిది కాదని, దీనికోసం ఇరువర్గాలు ఒక అడుగు దిగి మాట్లాడుకుంటే మంచిదంటూ సూచనలు కూడా చేశారు. తాజాగా గౌతమ్ గంభీర్ కూడా ఈ కోవలోకే చేరాడు. వీరి మధ్య విభేదాలను “అంతర్గత యుద్ధం” గా గంభీర్ అభివర్ణించాడు. “ఇది అంతర్గత యుద్ధం. ఇది చాలా చిన్న విషయం. దాని లోతుకు వెళితే, విషయం సులభంగా ఉంటుంది. ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు శాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది” అని టైమ్స్ నౌతో మాట్లాడుతూ గంభీర్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ, “విరాట్ రెడ్-బాల్ కెప్టెన్‌గా కొనసాగాలని నేను భావిస్తున్నాను. కానీ వైట్-బాల్ కెప్టెన్సీ కోసం, అతను ఒకసారి టీ20ఐ కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను వన్డే కెప్టెన్సీని కూడా వదిలేయాలి. బీసీసీఐ, సెలెక్టర్లు వైట్-బాల్ కోణం నుంచి చూస్తే అది సరైనదే. కానీ, టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. అతను కొనసాగించాల్సిన అవసరం ఉంది “అని గంభీర్ పేర్కొన్నాడు.
టెస్ట్ సారథి నుంచి కోహ్లి రాజీనామా చేయడంతో.. శ్రీలంకతో 100వ టెస్టు ఒక బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అక్కడ కోహ్లీ తన సుదీర్ఘ సెంచరీ కరువును ముగించాలని చూస్తున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ఐలలో తలపడే భారత వైట్-బాల్ జట్టులో కూడా సభ్యుడిగా భాగమయ్యాడు. “ప్రతిదానికీ పదవీకాలం, సమయ వ్యవధి ఉంటుంది. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి. ముందుకు సాగాలని, మరింత సాధించాలని ఆలోచించినప్పుడు కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే” అని కోహ్లీ తెలిపాడు.
Also Read: IPL 2022: ఏ ఫ్రాంచైజీ వాలెట్‌లో ఎంత డబ్బు ఉంది.. ఇంకెంతమంది ప్లేయర్లు కావాలంటే?
IPL 2022: ఖర్చులో కోహ్లీ టీం.. ట్రోఫీలో రోహిత్ టీం టాప్.. ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ చరిత్ర ఎలా ఉందంటే?