- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Remaining Purses of all 10 Franchises and their requirement of players ahead of Mega Auction
IPL 2022: ఏ ఫ్రాంచైజీ వాలెట్‌లో ఎంత డబ్బు ఉంది.. ఇంకెంతమంది ప్లేయర్లు కావాలంటే?
ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇందులో మొత్తం 590 మంది ఆటగాళ్ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.
Updated on: Feb 02, 2022 | 10:45 AM

IPL 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. వేలంలో 590 మంది ఆటగాళ్ల పేర్లు ఫైనల్ అయ్యాయి. అయితే, 10 ఫ్రాంచైజీలకు ఎంత అవసరమో అంతమందికే లక్ దొరకనుంది. ఆటగాళ్ల అవసరాలను తీర్చడానికి, ఏ ఫ్రాంచైజీ వాలెట్‌లో ఎంత డబ్బు ఉంది, ఏ ఫ్రాంచైజీకి ఎంత మంది ఆటగాళ్లు కావాలి, మెగా వేలానికి ముందు ఓసారి తెలుసుకుందాం. (ఫోటో: ఫైల్)

చెన్నై సూపర్ కింగ్స్: నాలుగుసార్లు IPL ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో 21 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 7 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్లవి. ఆటగాళ్ల స్లాట్‌లను పూరించడానికి CSK వాలెట్‌లో రూ. 48 కోట్లు మిగిలి ఉన్నాయి. (ఫోటో: AFP)

ఢిల్లీ క్యాపిటల్స్ - 21 మంది ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. ఇందులో 7 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు చెందినవి. ఆటగాళ్ల స్లాట్‌లను పూరించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాలెట్‌లో రూ. 47.5 కోట్లు మిగిలి ఉన్నాయి. (ఫోటో: AFP)ఢిల్లీ క్యాపిటల్స్ - 21 మంది ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. ఇందులో 7 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు చెందినవి. ఆటగాళ్ల స్లాట్‌లను పూరించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాలెట్‌లో రూ. 47.5 కోట్లు మిగిలి ఉన్నాయి. (ఫోటో: AFP)

కోల్‌కతా నైట్ రైడర్స్: మొత్తం 21 స్థానాల్లో 6 విదేశీ ఆటగాళ్లకు దక్కాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి, KKR వ్యాలెట్‌లో రూ. 48 కోట్లు ఉన్నాయి. (ఫోటో: AFP)

లక్నో సూపర్ జెయింట్స్- IPL 2022 కొత్త ఫ్రాంచైజీ వాలెట్‌లో రూ. 59 కోట్లు ఉన్నాయి. మొత్తం 22 మంది ఆటగాళ్లలో 7 విదేశీ ప్లేయర్లకు చెందినవి. (ఫోటో: ట్విట్టర్)

ముంబై ఇండియన్స్ - ఎంఐ పర్స్‌లో రూ. 48 కోట్లు మిగిలాయి. 21 మంది ఆటగాళ్లలో 7గురు విదేశీ ఆటగాళ్లకు స్థానం ఉంది. (ఫోటో: AFP)

పంజాబ్ కింగ్స్- IPL 2022 ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ. 72 కోట్లు కలిగి ఉంది. మొత్తం 23 ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్లకు 8 స్లాట్లు ఉన్నాయి. (ఫోటో: AFP)

రాజస్థాన్ రాయల్స్ - ఐపీఎల్ తొలి ఛాంపియన్ పర్సులో రూ. 62 కోట్లు ఉన్నాయి. ప్లేయర్‌ల కోసం 22 స్లాట్స్ ఉన్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లలో 7 స్లాట్లు ఉన్నాయి. (ఫోటో: AFP)

సన్‌రైజర్స్ హైదరాబాద్- IPL 2022 మెగా వేలానికి వెళ్లే ముందు, రెండుసార్లు ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ వాలెట్‌లో రూ. 68 కోట్లు మిగిలి ఉన్నాయి. మొత్తం 22 మంది ఆటగాళ్లలో 7గురు విదేశీ ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. (ఫోటో: AFP)

టీమ్ అహ్మదాబాద్ - ఈ టీమ్ పర్సులో రూ. 52 కోట్లు ఉన్నాయి. 22 మంది ఆటగాళ్లకు స్లాట్ ఖాళీగా ఉంది. విదేశీ ఆటగాళ్లకు 7 స్లాట్లు ఉన్నాయి. (ఫోటో: ఫైల్)




