- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Five Oldest Players to be Partin ipl 2022 Mega Auction
IPL 2022: ఐపీఎల్ ‘ముదుర్లు’.. ఆటలో మాత్రం యువకులే.. మెగా వేలంలో పాల్గొనే పెద్ద వయస్కులు వీరే..!
IPL 2022 Auction:ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం 590 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో వయసు పెరిగిన కొందరు ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఆటలో మాత్రం ఇప్పటికీ యువత కంటే తక్కువేం కాదంటూ..
Updated on: Feb 02, 2022 | 2:08 PM

ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం 590 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితా విడుదలైంది. ఈ జాబితాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది వయస్సులో, ఆటలో యువకులే ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువ వయసు కలవారూ ఉన్నారు. అయితే ఆటలో మాత్రం యువకులకు ఏమాత్రం తీసిపోమంటూన్నారు. IPL 2022 మెగా వేలంలో పాల్గొన్న 5గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

ఇమ్రాన్ తాహిర్: వయస్సు 43 సంవత్సరాలు. IPL 2022 మెగా వేలంలో పాల్గొన్న ఆటగాళ్లలో ఎక్కువ వయసుగలవాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా చిన్న, పెద్ద లీగ్‌లలో ఆడుతూ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఇటీవల, అతను లెజెండ్స్ లీగ్‌లో 19 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే బ్యాట్‌తోనూ తన ఫైర్‌ని చూపించే పూర్తి నైపుణ్యం అతని సొంతం.

ఫిడెల్ ఎడ్వర్డ్స్ - ఈ 40 ఏళ్ల ఆటగాడికి వెస్టిండీస్ తరఫున 100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ సమయంలో అతను 240 వికెట్లు తీశాడు. ఐపీఎల్ పిచ్‌పై 6 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు. ఫిడెల్ ఎడ్వర్డ్స్ 2009లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

అమిత్ మిశ్రా- 39 ఏళ్ల భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో 166 వికెట్లు తీశాడు. ఐపీఎల్ పిచ్‌పై గతేడాది ఆడిన 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. IPL 2022 మెగా వేలంలో పాల్గొన్నఎక్కువ వయసుగల వాళ్లలో ఒకడిగా నిలిచాడు.

ఎస్. శ్రీశాంత్: 39 ఏళ్ల శ్రీశాంత్-కేరళ ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందాడు. శ్రీశాంత్ మళ్లీ లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. 44 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అందులో అతను 40 వికెట్లు పడగొట్టాడు. 2013లో తన చివరి IPL మ్యాచ్ ఆడాడు.

డ్వేన్ బ్రావో - ఈ 38 ఏళ్ల కరేబియన్ సూపర్‌స్టార్‌కు ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ఆడిన అనుభవం కూడా ఉంది. ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌లు ఆడిన 1537 పరుగులతో పాటు 167 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో బ్రావో 14 వికెట్లు తీశాడు.




