- Telugu News Photo Gallery Cricket photos India vs west indies odi series: Team india openar mayank agarwal added to the odi squad after corona scare in indian camp
IND vs WI: 14 నెలల తర్వాత టీమిండియా వన్డే జట్టులోకి ఎంట్రీ.. క్లిష్ట పరిస్థితుల్లో ఓపెనర్‌గా సిద్ధమైన యంగ్ ప్లేయర్?
Team India: ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు, టీమిండియాలోని ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వన్డే సిరీస్‌లో వారు ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated on: Feb 03, 2022 | 9:16 AM

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు, కరోనా కేసులు తెరపైకి రావడంతో టీమిండియాలో కలకలం రేగింది. టీమ్ ఇండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్‌లతో పాటు, నవదీప్ సైనీ కూడా కోవిడ్ బారిన పడి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.

వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్, అయ్యర్‌లు ఆడటంపై ప్రస్తుతం సందేహం నెలకొంది. ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడేందుకు అవకాశం ఇస్తారు. ఈ కారణంగానే సెలక్టర్లు మయాంక్ అగర్వాల్‌ను వన్డే జట్టులోకి చేర్చుకున్నారు. తద్వారా అతను క్లిష్ట పరిస్థితుల్లో మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

మయాంక్ 2020లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అతను 2020లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాదిన్నరగా మయాంక్ ఎలాంటి వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. అయినప్పటికీ సెలక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు.

మయాంక్‌కి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. దీనికి కారణం ఈ సిరీస్‌కు స్టాండ్‌బైలుగా నిలిచిన ఎం. షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, రిషి ధావన్‌లలో ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. రోహిత్ శర్మకు ఓపెనింగ్ పార్టనర్‌గా వెంకటేష్ అయ్యర్‌ని ప్రయత్నించే అవకాశం ఉంది.




