Watch Video: నీ దీపావళి చిట్కాలు మాకొద్దు.. క్రికెట్ సరిగ్గా ఆడితే చాలు: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ట్రోల్స్.. ఎందుకో తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులు, నెటిజన్ల కోసం ట్విట్టర్‌లో దీపావళి సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలతో ఓ వీడియోను పంచుకున్నారు.

Watch Video: నీ దీపావళి చిట్కాలు మాకొద్దు.. క్రికెట్ సరిగ్గా ఆడితే చాలు: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ట్రోల్స్.. ఎందుకో తెలుసా?
Virat Kohli
Follow us

|

Updated on: Oct 19, 2021 | 8:13 AM

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులు, నెటిజన్ల కోసం ట్విట్టర్‌లో దీపావళి సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలతో ఓ వీడియోను పంచుకున్నారు. టీమిండియా కెప్టెన్ ఈ సంవత్సరం భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చాలా కష్టంగా ఉందని పేర్కొన్నాడు. దీపావళి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పండుగ సమీపిస్తోంది. మీ కుటుంబం, స్నేహితులతో ఆనందంగా దీపావళిని నిర్వహించుకునేందుకు నేను చిట్కాలు ఇస్తాను’ అంటే విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కొంతమంది నెటిజన్లకు, అభిమానులకు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో టీమిండియా కెప్టెన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కోహ్లీ ఈ వీడియో షేర్ చేసిన తర్వాత #SunoKohli ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. రకరకాల మీమ్స్ తయారు చేస్తూ నెటిజన్లు విరాట్‌ను ట్రోల్ చేస్తున్నారు. గతేడాది కూడా కోహ్లీ దీపావళి సమయంలో ఇలానే కొంతమంది ఆయనను ట్రోల్స్‌ చేశారు. దీపావళి రోజున అభిమానులకు శుభాకాంక్షలు తెలిపి, క్రాకర్స్ పేల్చవద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో విరాట్ కోహ్లీని బాగా ఆడుకున్నారు.

మా పండుగను ఎలా చేసుకోవాలో మాకు తెలుసు మా పండుగను ఎలా చేసుకోవాలో మాకు తెలుసు అని సోషల్ మీడియాలో ప్రజలు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. మీరు దీపావళి పాఠాలు బోధించడం మాని టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టండి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా దుబాయ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‍లో అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్ కిషన్ 70, కేఎల్ రాహుల్ 51 పరుగులతో రాణించారు. అలాగే బౌలింగ్‌లో షమీ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అన్నిరంగాల్లో భారత్ ఆధిపత్యం చూపించి ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. రేపు మరో వార్మప్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాపై ఆడనుంది. ఇక సూపర్ 12 పోటీలు అక్టోబర్ 23 నుంచి మొదలుకానున్నాయి. అత్యంత కీలకమైన మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు అక్టోబర్ 24న తలపడనున్నాయి.

Also Read: India vs Pakistan: ‘సైనికుల త్యాగాలను దాయాదుల క్రికెట్‌తో పోల్చడం సరికాదు.. ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ మాత్రమే’

India New Coach: నాకైతే సమాచారం లేదు.. కోచ్ అయ్యాక ఏం చేస్తాడో కూడా తెలియదు: విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్