MS Dhoni: టీమిండియా ఆల్ రౌండర్‌ కోసం నేలపైనే నిద్రపోయిన ఎంఎస్ ధోని.. ఎందుకంటే?

T20 World Cup 2021: ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత నాపై సస్పెన్షన్ విధించారు. అది పూర్తయిన తరువాత నేను 2019 లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాను. అప్పుడు..

MS Dhoni: టీమిండియా ఆల్ రౌండర్‌ కోసం నేలపైనే నిద్రపోయిన ఎంఎస్ ధోని.. ఎందుకంటే?
Hardik Pandya Ms Dhoni

Hardik Pandya-MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ గొప్పతనం గురించి మనందరికీ తెలిసిందే. క్రికెట్‌లోనే కాదు.. బయట కూడా తన ఉదారతను చాటుకూంటూ అందరి చేత మన్ననలను పొందడం చూసే ఉన్నాం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పకున్న తరువాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతోన్న ధోనీని, టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్‌ఫో క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత నాపై సస్పెన్షన్ విధించారు. అది పూర్తయిన తరువాత నేను 2019 లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాను. అయితే హోటల్‌లో మొదట్లో నాకు రూమ్ దొరకలేదు. ధోనీ నన్ను తన గదికి ఆహ్వానించాడు. గదిలో ఒకే ఒక మంచం ఉంది. నన్ను మంచం మీద పడుకోమని చెప్పాడు. ఆయన మాత్రం కిందే పడుకున్నాడు. నాకు సహాయం అవసరమైనప్పుడు ఆయన నాకు మద్దతు ఇచ్చాడు. ధోనీ నా అన్నయ్య లాంటి వాడు’ అంటూ అలానాటి ఓ విషయాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగం అయ్యాడు.

ఫినిషర్ బాధ్యత నా భుజాలపై ఉంది..
టీ 20 ప్రపంచకప్‌లో ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం వల్ల నాపై బాధ్యత మరింత పెరిగింది అని పాండ్యా తెలిపాడు. ఈసారి ఫినిషర్ బాధ్యత నా భుజాలపై ఉంటుంది. ధోనీ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ధోనీ లేని భారత్‌కు ఇది తొలి టీ 20 ప్రపంచకప్. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ కోసం మాజీ కెప్టెన్ ధోనీని బీసీసీఐ మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియాతో చేరిన ధోని.. మెంటార్‌గా తన పనులు ప్రారంభించాడు.

హార్దిక్ ఫామ్ చాలా దారుణంగా ఉంది
హార్దిక్ పాండ్యా ఫామ్ గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఉంది. అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం కష్టంగా మారింది. అలాగే బౌలింగ్‌ కూడా చేయడం లేదు. ఐపీఎల్ 2021 లో 12 మ్యాచ్‌లలో హార్దిక్ 14.11 సగటుతో కేవలం 112 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.

తొలి వార్మప్‌లో ఘన విజయం
టీ20 ప్రపంచ కప్‌ 2021 లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచును సోమవారం నాడు ఆడింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత ఇంగ్లండ్ 188/5 స్కోర్ చేసింది. 189 పరుగుల లక్ష్యాన్ని విరాట్ సేన 3 వికెట్ల నష్టపోయి విజయం సాధించింది. మరోసారి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వేయలేదు. దీనితో పాటు, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్ ఫామ్ కూడా కెప్టెన్ కోహ్లీకి ఇబ్బందిలోకి పడేసింది. కేఎల్ రాహుల్ 24 బంతులు 51 పరుగులు(6 ఫోర్లు, 3 సిక్సులు), ఇసాన్ కిషన్ 46 బంతులు 70(రిటైర్డ్ హర్ట్)పరుగులతో(7 ఫోర్లు, 3 సిక్సులు) రాణించి తమ అద్భుత ఫాంను మరోసారి చాటుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (11), సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచారు. రిషబ్ పంత్ 14 బంతుల్లో 29, హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Also Read: Watch Video: నీ దీపావళి చిట్కాలు మాకొద్దు.. క్రికెట్ సరిగ్గా ఆడితే చాలు: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ట్రోల్స్.. ఎందుకో తెలుసా?

India vs Pakistan: ‘సైనికుల త్యాగాలను దాయాదుల క్రికెట్‌తో పోల్చడం సరికాదు.. ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ మాత్రమే’

Click on your DTH Provider to Add TV9 Telugu