Watch Video: గబ్బర్ అవతారం ఎత్తిన టీమిండియా కెప్టెన్.. ఫన్నీ వీడియోతో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న విరాట్ కోహ్లీ

T20 World Cup 2021: నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో ట్రెండింగ్‌లో ఉండే విరాట్ కోహ్లీ.. ఈ సారి కూడా ఓ ఫన్నీ వీడియోతో నవ్వులు పూయిస్తున్నాడు. శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిని కాపీ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.

Watch Video: గబ్బర్ అవతారం ఎత్తిన టీమిండియా కెప్టెన్.. ఫన్నీ వీడియోతో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న విరాట్ కోహ్లీ
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Oct 19, 2021 | 9:27 AM

Kohli Mimics Dhawan Batting Style: టీ20 ప్రపంచ కప్‌ 2021లో టీమిండియా విజయంతో అడుగులు వేస్తోంది. సోమవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచులో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే భారత ఆటగాళ్లకు అసలు పోరుకు ముందు ప్రాక్టీస్ బాగా దొరికింది. ఇక రేపు రెండో వార్మప్ మ్యాచులో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. అయితే ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో ట్రెండింగ్‌లో ఉండే విరాట్ కోహ్లీ.. ఈ సారి కూడా ఓ ఫన్నీ వీడియోతో నవ్వులు పూయిస్తున్నాడు. కోహ్లీ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిని కాపీ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.

కెప్టెన్ కోహ్లీ ఫన్నీ లుక్ నేను ఈ రోజు శిఖర్ బ్యాటింగ్ శైలిని అనుకరిస్తాను అంటూ వీడియో పంచుకున్నాడు. శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిని భారత కెప్టెన్ కాపీ చేసిన విధానం అభిమానులను ఫిదా చేస్తోంది. అచ్చం శిఖర్ ధావన్‌లాగే చేయడంతో నెట్టింట్లో నవ్వులు పూస్తున్నాయి. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరలవుతోంది.

ధావన్ ప్రపంచకప్ జట్టులో లేడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ 20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇటీవల, ధావన్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ తరఫున టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఐపీఎల్‌ 14 సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌లలో 39.13 సగటుతో 587 పరుగులు చేశాడు.

అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో కోహ్లీ సేన టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ తరువాత అక్టోబర్ 31 న న్యూజిలాండ్‌, నవంబర్ 3 న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. అలాగే నవంబర్ 5 న బి 1, 8 నవంబర్‌లో ఎ 2 తో తలపడుతుంది. దీంతో టీమిండియా సూపర్ 12 స్టేజ్ అయిపోతుంది.

Also Read: MS Dhoni: టీమిండియా ఆల్ రౌండర్‌ కోసం నేలపైనే నిద్రపోయిన ఎంఎస్ ధోని.. ఎందుకంటే?

Watch Video: నీ దీపావళి చిట్కాలు మాకొద్దు.. క్రికెట్ సరిగ్గా ఆడితే చాలు: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ట్రోల్స్.. ఎందుకో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!