T20 World Cup: వారిద్దరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది.. అతను ఇప్పుడు ఫామ్‎లో ఉన్నాడు.. ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

టీ 20 వరల్డ్ కప్‎కు టీం ఇండియా సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 24న భారత్ పాక్‎తో తలపడనుంది. అయితే ఓపెనర్లు ఎవరు అనేదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహల్ ఓపెనర్లుగా వస్తారా.. లేక ఏమైనా మార్పులు ఉంటాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు...

T20 World Cup: వారిద్దరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది.. అతను ఇప్పుడు ఫామ్‎లో ఉన్నాడు.. ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Chopra
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 19, 2021 | 8:10 AM

టీ 20 వరల్డ్ కప్‎కు టీం ఇండియా సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 24న భారత్ పాక్‎తో తలపడనుంది. అయితే ఓపెనర్లు ఎవరు అనేదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహల్ ఓపెనర్లుగా వస్తారా.. లేక ఏమైనా మార్పులు ఉంటాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే తన కోరికను వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో కెఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్‏గా దిగి బాగా ఆడాడు. ఈ నేపథ్యంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనేదానిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‎లో స్పందించాడు. రోహిత్ శర్మ వన్డే, టీ 20 ఫార్మట్‎లో టాప్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని చెప్పారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ టీం ఇండియాకు ఓపెనింగ్ చేయడానికి ఫర్‎ఫెక్ట్ జోడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కోహ్లీ మూడో స్థానంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

“మొదటిది బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది? చివరిసారి ఆడినప్పుడు రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేశారు. వారిద్దరూ చాలా హిట్ అయ్యారు. కానీ రాహుల్ ఆ సమయంలో బాగా ఆడలేదు” అని ఆకాష్ చోప్రా అన్నారు. రాహుల్‌కు మద్దతు ఇస్తూ “అయితే ఇప్పుడు రాహుల్ ఫామ్‎లో ఉన్నాడు. రోహిత్, విరాట్ కంటే రాహుల్ బాగా ఆడుతున్నాడు.” అని చెప్పాడు. దయచేసి రోహిత్, రాహుల్‌ని ఓపెనర్లుగా పంపాలని కోరారు. ” రాహుల్ నిర్భయమైన ఆడాలని కోరుకుంటున్నాను. విరాట్ కోహ్లీ నెం .3 లో, అలాగే సూర్య ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో చూడాలనుకుంటున్నాను. ” అని అతను చెప్పాడు. రాహుల్ ఐపీఎల్ 2021 లో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడ్డాడు. కానీ వారి జట్టు ఫైనల్ వెళ్లకపోటంతో రూతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్ వరుసగా మొదటి, రెండో స్థానానికి చేరుకున్నారని పేర్కొన్నారు.

కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కెఎల్ రాహుల్ 13 మ్యాచ్‎ల్లో 626 పరుగులు సాధించాడు. ఆరు అర్ధ సెంచరీలు కూడా నమోదు చేశాడు. రోహిత్ 13 మ్యాచ్‌ల్లో 381 పరుగులు చేయగా కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 405 పరుగలు చేశాడు. సోమవారం ఇంగ్లాండ్‎తో జరిగిన వార్మప్ మ్యాచ్‎లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇషాన్ కిషన్ 70 పరుగులు, కెఎల్ రాహుల్ 51 పరుగులతో రాణించారు. భారత్ తర్వాత ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

Read Also.. T 20 World Cup: వార్మప్ మ్యాచ్‎లో అదరగొట్టిన టీం ఇండియా.. ఇంగ్లాండ్‎పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం..