Team India: తొలి మ్యాచ్ నుంచి టీమిండియా తుఫాన్ ప్లేయర్ ఔట్.. ఓపెనర్లుగా వీరిద్దరు ఫిక్స్?
Sanjay Bangar on Team India Opening Combination: టీ20 ప్రపంచ కప్ 2024 మొదటి మ్యాచ్‌లో భారత జట్టుకు ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న అందరి మనస్సులో మొదులుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పందించారు.

Sanjay Bangar on Team India Opening Combination: టీ20 ప్రపంచ కప్ 2024 మొదటి మ్యాచ్‌లో భారత జట్టుకు ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న అందరి మనస్సులో మొదులుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పందించారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసిన జట్టును చూస్తుంటే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసి యశస్వి జైస్వాల్‌ను తప్పించేలా ఉన్నారని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు, టీమ్ ఇండియా పెద్ద డైలమాలో కూరుకుపోయింది. ఓపెనర్ల ఎంపిక విషయంలో టీమిండియా డైలమాను ఎదుర్కొంటోంది. విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేయాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ ముందు ఉన్న పెద్ద ప్రశ్నగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చాలా రకాల ప్రయోగాలు జరిగాయి. సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా మార్చారు. రిషబ్ పంత్‌కు 3వ స్థానంలో ఆడే అవకాశం లభించింది. అప్పటి నుంచి రిషబ్ పంత్ వాస్తవానికి మూడో నంబర్‌లో ఆడే అవకాశం ఉందా, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందా అనే ఊహాగానాలు జరుగుతున్నాయి.
తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లి- సంజయ్ బంగర్..
అదే సమయంలో, ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయగలడని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ కూడా అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ బహుశా మొదటి మ్యాచ్‌లో ఆడడు. కోహ్లీతోనే జట్టు వెళ్లాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టు ప్లాన్‌లో భాగమైతే, అతను ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడేవాడు. యశస్వి జైస్వాల్ ఆడలేదు కాబట్టి, మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం ఖాయం అంటూ తేల్చేశాడు.
టీ20 ఇంటర్నేషనల్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా ఓపెనింగ్ చేయలేదు. అతను కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్‌కు ఆడుతున్నప్పుడు ఓపెనింగ్ అవకాశం పొందాడు. అయితే, అతని ఏకైక T20 అంతర్జాతీయ సెంచరీ కూడా ఓపెనింగ్‌లో రావడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




