AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఒకట్రెండు కాదు.. ఏకంగా 7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!

Virat Kohli ODI Comeback: కోహ్లీ ఫామ్‌లోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని నమ్ముతున్న కోట్ల మంది భారతీయ క్రికెట్ అభిమానులకు ఈ సిరీస్ ఖచ్చితంగా కనువిందు చేయనుంది. మరి ఇంగ్లాండ్ సిరీస్‌లో కోహ్లీ ఈ ఏడు చారిత్రాత్మక రికార్డులను అందుకుని సగర్వంగా నిలుస్తాడో లేదో చూడాలి.

Virat Kohli: ఒకట్రెండు కాదు.. ఏకంగా 7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
Ind Vs Eng Virat Kohli Records
Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 1:31 PM

Share

Virat Kohli ODI Comeback: గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న కోహ్లీ కళ్లముందు ఏకంగా ఏడు అద్భుతమైన రికార్డులు కదలాడుతున్నాయి. ఈ సిరీస్‌తో కింగ్ కోహ్లీ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన విశ్వరూపం చూపించడానికి సర్వం సిద్ధమైంది.

గాయం తర్వాత ‘కింగ్’ రీఎంట్రీ.. అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ..

భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలో పరుగుల వరద పారించడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన గాయానికి గురైన కోహ్లీ.. ఆ తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కోలుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరం కావలసి వచ్చింది. ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్ బై చెప్పేసిన విరాట్.. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ పర్యటన అతనికి అత్యంత కీలకంగా మారింది. సంపూర్ణ ఫిట్‌నెస్ సాధించిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడేందుకు, తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు బ్యాట్ ఝుళిపించనున్నాడు.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

ఇవి కూడా చదవండి

సచిన్ సరసన నిలిచేలా.. 15 వేల పరుగుల మైలురాయి!

ఈ మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో 203 పరుగులు సాధిస్తే, వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. భారత్ తరఫున ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లోనే కోహ్లీ ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లాండ్‌పై భారత్ తరఫున అత్యధిక పరుగులు..

రికార్డుల వేట ఇక్కడితో ఆగలేదు. ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులు చేస్తే చాలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై 38 వన్డేలు ఆడిన కోహ్లీ 1,397 పరుగులు సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే కోహ్లీ.. ఈ సిరీస్‌లో 81 పరుగులు దాటితే, వన్డేల్లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 16,000 పరుగులు పూర్తి చేసుకున్న ఘనతను సొంతం చేసుకుంటాడు.

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

యువరాజ్, సచిన్ రికార్డులపై గురి..

ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో యువరాజ్ సింగ్ (1523 పరుగులు) అగ్రస్థానంలో, సచిన్ టెండూల్కర్ (1455 పరుగులు) రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ సిరీస్‌లో మరో 150 పరుగులు చేస్తే వీరిద్దరినీ దాటి అగ్రస్థానానికి చేరుకుంటాడు. దీనితో పాటు ఈ మూడు వన్డేల్లో కోహ్లీ కనుక రెండు సెంచరీలు బాదితే, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్రపంచ రికార్డు కూడా అతడి ఖాతాలో చేరుతుంది. అలాగే ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి వస్తున్నా విరాట్ కోహ్లీ పరుగుల ఆకలి ఏమాత్రం తగ్గలేదని అతడి రికార్డుల గణాంకాలు చెబుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన మార్క్ క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఇంగ్లాండ్ పిచ్‌లపై పరుగుల విధ్వంసం సృష్టించడానికి కింగ్ కోహ్లీ సిద్ధమయ్యాడు. కోహ్లీ ఫామ్‌లోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని నమ్ముతున్న కోట్ల మంది భారతీయ క్రికెట్ అభిమానులకు ఈ సిరీస్ ఖచ్చితంగా కనువిందు చేయనుంది. మరి ఇంగ్లాండ్ సిరీస్‌లో కోహ్లీ ఈ ఏడు చారిత్రాత్మక రికార్డులను అందుకుని సగర్వంగా నిలుస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
ఇంగ్లాండ్‌లో ఇరరగదీసినా.. 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే
ఇంగ్లాండ్‌లో ఇరరగదీసినా.. 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే
వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఇలా శాశ్వతంగా తరమేయండి
వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఇలా శాశ్వతంగా తరమేయండి
లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు
లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు
రోజు రాత్రి ఇంట్లో భారీ శబ్ధాలు.. అనుమానంతో వెళ్లి చూడగా
రోజు రాత్రి ఇంట్లో భారీ శబ్ధాలు.. అనుమానంతో వెళ్లి చూడగా
కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల మోత..
కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల మోత..