టీమిండియా పనికిరాడని పక్కనపెట్టేసింది.. కట్ చేస్తే.. ఇంగ్లాండ్‌లో తేలిన గంభీర్ శిష్యుడు.. ఎవరంటే.?
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు ఓ ప్లేయర్. అతడు టీమిండియా తరపున చివరి మ్యాచ్ 2 సంవత్సరాల క్రితం ఆడాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ..

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు ఓ ప్లేయర్. అతడు టీమిండియా తరపున చివరి మ్యాచ్ 2 సంవత్సరాల క్రితం ఆడాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరీర్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు ఈ ప్లేయర్. త్వరలోనే ఇంగ్లాండ్ తరపున ఆడనున్నాడు. అతడెవరో తెలుసా.? కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్.
ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాలని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ నిర్ణయానికి వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ ఈ ఏడాది లాంక్షైర్ తరపున వన్డే కప్, రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ మేరకు అయ్యర్‌తో ఐదు వారాల ఒప్పందం కుదుర్చుకుంది లాంక్షైర్ కౌంటీ జట్టు. కౌంటీ క్రికెట్‌లో భాగం కావడం వెంకటేష్ అయ్యర్‌కు ఇదే తొలిసారి. ఐపీఎల్ గత 2 సీజన్‌లు వెంకటేష్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2024లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మొత్తం 370 పరుగులు చేయడమే కాదు.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు
కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా..
ఇంగ్లాండ్‌లో తొలిసారిగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని వెంకటేష్ అయ్యర్ తెలిపాడు. లాంక్షైర్ తరపున ఫరూక్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఇండియన్ ప్లేయర్స్ ఆడారు. ఆ సంప్రదాయాన్ని తాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
టీమిండియాలోకి తిరిగి రీ-ఎంట్రీ ఎప్పుడో.?
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత వెంకటేష్ అయ్యర్‌కు టీమ్ ఇండియాకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో వెంకటేష్ అయ్యర్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు టీమిండియా తరపున 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 24 పరుగులు, టీ20లో 133 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బంతి నుంచి 5 వికెట్లు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ తన చివరి మ్యాచ్‌ని టీమిండియా తరపున 2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో ఆడాడు. అప్పటి నుంచి అతనికి టీమ్ ఇండియాలో చోటు దక్కలేదు.
ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




