AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

38 ఫోర్లు, 18 సిక్సర్లతో టీ20కే దడ పుట్టించాడు.. అరవీర భయంకరుడైన ఆ ప్లేయర్‌ ఎవరో తెల్సా?

మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఫైనాలిస్టులు ఖరారు అయ్యారు. సోమవారం డల్లాస్ వేదికగా వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికోర్న్స్ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు దుమ్ములేపింది.

38 ఫోర్లు, 18 సిక్సర్లతో టీ20కే దడ పుట్టించాడు.. అరవీర భయంకరుడైన ఆ ప్లేయర్‌ ఎవరో తెల్సా?
Srh
Ravi Kiran
|

Updated on: Jul 27, 2024 | 10:38 AM

Share

మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఫైనాలిస్టులు ఖరారు అయ్యారు. సోమవారం డల్లాస్ వేదికగా వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికోర్న్స్ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు దుమ్ములేపింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్‌లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాట్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడగా, రచిన్ రవీంద్ర బంతితో మాయాజాలం చేశాడు. ఇక ట్రావిస్ హెడ్ ఈ ఫిఫ్టీతో అరుదైన ఘనత సాధించాడు.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు 19 ఓవర్లలో 145 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని వాషింగ్టన్ ఫ్రీడమ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ సమయంలో ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ బ్యాట్‌ నుంచి 10 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. 175 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు వరద పారించాడు.

ఇవి కూడా చదవండి

మేజర్ లీగ్ క్రికెట్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ట్రావిస్ హెడ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు వరుసగా 5 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించిన 9వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు ట్రావిస్ హెడ్. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో, రియాన్ పరాగ్ వరుసగా 7 అర్ధ సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్. ఐపీఎల్ 2024లో ట్రావిస్ హెడ్ బలమైన ప్రదర్శన కనబరిచాడు. సీజన్ మొత్తంలో వేగంగా బ్యాటింగ్ చేస్తూ సంచలనాలు నమోదు చేశాడు. అతడు 15 మ్యాచ్‌ల్లో 40.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో అతడి నుంచి 4 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ వచ్చింది. ఇక ఐపీఎల్ ఈ సీజన్‌ అంతా ట్రావిస్ హెడ్ 64 ఫోర్లు, 32 సిక్సర్లు బాదాడు.

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు