IND Vs SL: తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. బరిలోకి సిక్సర్ల కింగ్.. బెంచ్‌కే ఆ ఇద్దరు.!

భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఫస్ట్ అసైన్‌మెంట్. అదే సమయంలో కొత్త టీ20 కెప్టెన్‌తో కూడా రంగంలోకి దిగుతోంది భారత్ జట్టు. ఆ వివరాలు ఇలా..

IND Vs SL: తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. బరిలోకి సిక్సర్ల కింగ్.. బెంచ్‌కే ఆ ఇద్దరు.!
Ind Vs Sl
Follow us

|

Updated on: Jul 27, 2024 | 9:49 AM

భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఫస్ట్ అసైన్‌మెంట్. అదే సమయంలో కొత్త టీ20 కెప్టెన్‌తో కూడా రంగంలోకి దిగుతోంది భారత్ జట్టు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తొలి టీ20 మ్యాచ్‌కు ఎవరెవరు చోటు దక్కించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా..?

శ్రీలంకతో జరిగే తొలి టీ20కు టీమిండియా ఓపెనింగ్ జోడీగా శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆడడం దాదాపు ఖాయం. ఇక రిషబ్ పంత్ వన్‌డౌన్‌లో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో నెంబర్‌లో బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లకు అవకాశం దక్కవచ్చు. మరోవైపు బౌలర్లుగా రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లకు ప్లేయింగ్ 11లో చోటు కన్ఫర్మ్ అని టాక్.

ఇవి కూడా చదవండి

ఈ ఆటగాళ్లు బెంచ్‌కే.!

రియాన్ పరాగ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్‌లకు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమే. మొదటి టీ20కి ఈ నలుగురు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది. రిషబ్ పంత్ రాకతో.. సంజూ శాంసన్‌కు నో ఛాన్స్. అలాగే హార్దిక్ పాండ్యా జట్టులో ఉండటంతో.. శివమ్ దూబే స్థానం కూడా ప్రమాదంలో పడింది.

తొలి టీ20కి టీమిండియా జట్టు(అంచనా):

శుభ్‌మాన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..