Video: ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే ఊచకోత.. 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్

Varun Chakaravarthy: విజయ్ హజారే ట్రోఫీలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. తమిళనాడు తరఫున వరుణ్ చక్రవర్తి 9 ఓవర్లలో 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

Video: ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే ఊచకోత.. 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
Varun Chakaravarthy 5 Wicket Haul
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2025 | 12:36 PM

Varun Chakaravarthy 5 Wicket Haul: విజయ్ హజారే ట్రోఫీలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. తమిళనాడు తరపున వరుణ్ చక్రవర్తి 9 ఓవర్లలో 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో తమిళనాడు జట్టు రాజస్థాన్‌ను 267 పరుగులకు ఆలౌట్ చేసింది. తమిళనాడు కెప్టెన్ ఆర్ సాయి కిషోర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడం సరైనదని నిరూపించాడు.

ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు భారత బౌలర్ల భీకర ఫామ్‌..

అద్భుతమైన ప్రదర్శన కారణంగా, వరుణ్ చక్రవర్తి ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక కోసం లిస్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రమాదకరమైన జట్టు భారత పర్యటనకు వస్తోంది. జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇరు దేశాల మధ్య ఈ టీ20 సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత రెండు దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఇంగ్లండ్‌తో జరిగే ఈ వైట్ బాల్ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

7 విధాలుగా బంతిని విసిరే మిస్టరీ మ్యాన్..

తమిళనాడుకు చెందిన స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 7 విధాలుగా బంతిని విసరగలడు. వీటిలో ఆఫ్‌బ్రేక్, లెగ్‌బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, ఫ్లిప్పర్, టాప్‌స్పిన్, యార్కర్ ఆన్ టోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తి 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, అతను 70 ఐపీఎల్ మ్యాచ్‌లలో 83 వికెట్లను తన పేరిట కలిగి ఉన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కావొచ్చు..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా భారత జట్టులో చేర్చవచ్చు అని అంటున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
నితీష్ కుమార్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం!
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
L&T చైర్మన్‌‌కి క్లాస్ పీకిన గుత్తా జ్వాల
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
Video: 5 వికెట్లతో రెచ్చిపోయిన టీమిండియా మిస్టరీ బౌలర్
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. నయా థ్రిల్లర్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా