AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు

vaibhav suryavanshi: విజయ్ హజారే ట్రోఫీలో బరోడాపై 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా జట్టుపై నాలుగు సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టి అద్భుత అర్ధశతకం సాధించాడు. అయితే, దీని తర్వాత కూడా అతని జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు
Vaibhav Suryavanshi
Velpula Bharath Rao
|

Updated on: Jan 01, 2025 | 4:00 AM

Share

విజయ్ హజారే ట్రోఫీ 2024లో 38 జట్లు పాల్గొంటున్నాయి. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ చెప్పుకొద్దగా ఇన్నింగ్స్ ఏమి ఆడలేదు.  ఐపిఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి ఉంది. బీహార్‌కు చెందిన ఈ టీనేజ్ బ్యాట్స్‌మెన్ ఎట్టకేలకు తన బ్యాట్‌తో సత్తా చూపించి టోర్నీలో సంచలనం సృష్టించాడు. బరోడా, బీహార్ మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో, సూర్యవంశీ 12 బౌండరీల సహాయంతో  హాఫ్ సెంచరీ చేశాడు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బరోడా, బీహార్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హార్దిక్ ఈ మ్యాచ్‌లో పాల్గొనలేదు కానీ అతని అన్న కృనాల్ పాండ్యా కూడా ఈ యువ బ్యాట్స్‌మన్‌ను ఆపలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 49 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా, బీహార్‌కు ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ అతనిని దారుణంగా చిత్తు చేశాడు. 169 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తన జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. 42 బంతులు ఎదుర్కొని 71 పరుగులు చేశాడు.

సూర్యవంశీ ఫిఫ్టీలో 12 బౌండరీలు ఉన్నాయి. 8 ఫోర్లు కాకుండా నాలుగు సిక్సర్లు కూడా బాదాడు. ఈ సీజన్ నుంచే వైభవ్ విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టడం గమనార్హం.దీంతో అతను తన పేరు మీద రికార్డు కూడా సృష్టించాడు. అతను లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు స్పష్టించాడు. అయితే సూర్యవంశీ తన అరంగేట్రం మ్యాచ్‌లో విఫలమయ్యాడు. వైభవ్ 13 సంవత్సరాల 269 రోజుల వయస్సులో మధ్యప్రదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ అందులో అతను రెండవ బంతికే ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ అవుటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు చెప్పుకోదగ్గ సహకారం అందించలేక పోవడంతో 241 పరుగులకే ఆలౌటైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి