USA vs IND Playing XI: అమెరికాతో మ్యాచ్.. టాస్ గెల్చిన టీమిండియా.. సంజూకు మొండి చేయి

ICC T20 World Cup United States vs India Playing XI: ICC T20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య జట్టు అమెరికాతో టీమిండియా తలపడుతోంది. ఈ టోర్నీలో ఇరు జట్ల కు ఇది మూడో మ్యాచ్. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు విజయం సాధించాయి.

USA vs IND Playing XI: అమెరికాతో మ్యాచ్.. టాస్ గెల్చిన టీమిండియా.. సంజూకు మొండి చేయి
United States Vs India

Updated on: Jun 12, 2024 | 7:50 PM

ICC T20 World Cup United States vs India Playing XI: ICC T20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య జట్టు అమెరికాతో టీమిండియా తలపడుతోంది. ఈ టోర్నీలో ఇరు జట్ల కు ఇది మూడో మ్యాచ్. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు విజయం సాధించాయి. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్ 8కి చేరుకోవాలని యూఎస్‌ఏ, టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతున్నాయి. న్యూయార్క్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో ఇదే చివరి మ్యాచ్‌ అయితే అమెరికా జట్టు ఈ మైదానంలో ఆడడం ఇదే తొలిసారి. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు వర్షం కారణంగా మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కాలేదు. ఈరోజు నస్సౌ కౌంటీలో ఎండగా ఉంది, అయితే రాత్రి 7.30 (భారతదేశంలో) తర్వాత తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా న్యూయార్క్ పిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్లకు స్వర్గధామంలా ఈ డ్రాపౌట్ పిచ్ మారింది. పరుగులు చేసేందుకు బ్యాటర్లు చెమటోడ్చుతున్నారు. ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లన్నింటిలోనూ  తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. మరి అమెరికా వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఎన్ని పరుగులు నమోదవుతాయో చూడాలి.

 

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి యూఎస్ఏ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

యునైటెడ్ స్టేట్స్ (ప్లేయింగ్ XI):

స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(w), ఆరోన్ జోన్స్(c), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..