AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shardul Thakur: ఆస్పత్రి బెడ్‌పై టీమిండియా స్టార్ ఆల్ రౌండర్.. త్వరలో తిరిగివస్తానంటూ పోస్ట్.. ఏమైందంటే?

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్తాన్ లను మట్టికరిపించిన భారత జట్టు మరికాసేపట్లో ఆతిథ్య జట్టు అమెరికాతో తలపడనుంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే.. టీమిండియా దాదాపు సూపర్ 8 కు చేరినట్టే.ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నట్లుండి సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించాడు.

Shardul Thakur: ఆస్పత్రి బెడ్‌పై టీమిండియా స్టార్ ఆల్ రౌండర్.. త్వరలో తిరిగివస్తానంటూ పోస్ట్.. ఏమైందంటే?
Shardul Thakur
Basha Shek
|

Updated on: Jun 12, 2024 | 6:35 PM

Share

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్తాన్ లను మట్టికరిపించిన భారత జట్టు మరికాసేపట్లో ఆతిథ్య జట్టు అమెరికాతో తలపడనుంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే.. టీమిండియా దాదాపు సూపర్ 8 కు చేరినట్టే.ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నట్లుండి సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించాడు. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందసాగారు. శార్దూల్ కు ఏమైందంటూ ఆరా తీశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శార్దూల్ ఠాకూర్ కాలికి ఇటీవల గాయమైంది. తాజాగా ఆ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆస్పత్రి బెడ్ పై కాలికి కట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..’సర్జరీ సక్సెస్ అయ్యింది. త్వరలోనే గ్రౌండ్ లో కలుసుకుందాం. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం శార్దూల్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. టీమిండియా ఆల్ రౌండర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం 9 మ్యాచ్ లు ఆడిన అతను 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ పరుగులు చేయలేకపోయాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే గాయం కారణంగానే శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ సీజన్ లో పూర్తి మ్యాచ్ లు ఆడలేదని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సర్జరీ చేయించుకున్నానని, త్వరలోనే గ్రౌండ్ లోకి వస్తానంటున్నాడీ టీమిండియా ఆల్ రౌండర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..