AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastest Century: మొన్న 28 బంతుల్లో.. నేడు 36 బంతుల్లో.. ఫాస్టెస్ట్ సెంచరీలతో రెచ్చిపోతోన్న అన్‌సోల్డ్ ప్లేయర్

Urvil Patel Smashes 36 Ball Century: ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన వారం వ్యవధిలో రెండు తుఫాను సెంచరీలు సాధించాడు. దీంతో తనను వద్దనుకున్న ఫ్రాంచైజీలకు బిగ్ షాక్ ఇచ్చాడు.

Fastest Century: మొన్న 28 బంతుల్లో.. నేడు 36 బంతుల్లో.. ఫాస్టెస్ట్ సెంచరీలతో రెచ్చిపోతోన్న అన్‌సోల్డ్ ప్లేయర్
Urvil Patel Century
Venkata Chari
|

Updated on: Dec 03, 2024 | 4:57 PM

Share

Syed Mushtaq Ali Trophy 2024: భారత్ తరపున టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఉర్విల్ పటేల్.. ఈ ఫీట్ చేసిన 6 రోజుల తర్వాత మరోసారి అద్భుతం సృష్టించాడు. తాజాగా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2025లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన తర్వాత అతని బ్యాట్ నుంచి ఇది రెండవ తుఫాను సెంచరీగా నిలిచింది. ఇటీవల నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో రిషబ్ పంత్‌ను ఓడించి టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇప్పుడు ఉత్తరాఖండ్‌తో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరపున ఆడిన ఉర్విల్ 41 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 41 బంతుల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉర్విల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తానే బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలే..

ఉర్విల్ రూ. 30 లక్షల బేస్ ధరతో ఐపీఎల్ వేలంలోకి ప్రవేశించాడు. కానీ, ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. దీంతో అతను అమ్ముడుపోలేదు. కానీ, ఇప్పుడు ఫ్రాంచైజీలు అతని తుఫాన్ ఇన్నింగ్స్‌తో చింతిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ తరపున ఆదిత్య తారే అత్యధికంగా 26 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతనికి తోడు రవికుమార్ సమర్థ్ 54 పరుగులు చేశాడు. గుజరాత్‌లో విశాల్ జైస్వాల్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ 13.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పటేల్ 41 బంతుల్లో 115 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతను తన తుఫాను ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతడితో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ 18 బంతుల్లో 28 నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..