T20 World Cup: ఆతిథ్య జట్టుకు విలన్‌గా మారిన వరుణుడు.. కంగారూలు సెమీస్‌కు చేరుకోవాలంటే అదొక్కటే దారి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. నిరంతరం అడ్డు పడుతూ టోర్నీ ఫేవరెట్లుగా భావించిన టాప్‌ టీంలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ముఖ్యంగా డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుపై వరుణుడి ఎఫెక్ట్‌ బాగానే పడింది

T20 World Cup: ఆతిథ్య జట్టుకు విలన్‌గా మారిన వరుణుడు.. కంగారూలు సెమీస్‌కు చేరుకోవాలంటే అదొక్కటే దారి
Finch, Buttler
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 9:52 AM

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. నిరంతరం అడ్డు పడుతూ టోర్నీ ఫేవరెట్లుగా భావించిన టాప్‌ టీంలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ముఖ్యంగా డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుపై వరుణుడి ఎఫెక్ట్‌ బాగానే పడింది. సూపర్ 12 రౌండ్ మొదలైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నాలుగు జట్లు ఒక్కో పాయింట్ పంచుకున్నాయి. కాగా గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. మైదానం చిత్తడిగా మారడంతో టాస్‌ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఇప్పటి వరకు సూపర్‌ 12 స్టేజ్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరో మ్యాచ్‌లో గెలుపు అంచున ఉన్న ఇంగ్లండ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఐర్లాండ్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే జింబాబ్వేతో పోరులో గెలుపు అంచున ఉన్నప్పటికీ వర్షం కారణంగా దక్షిణాఫ్రికా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.

కంగారూలకు ముప్పు?

కాగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడితే, డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు.. దీంతో సెమీస్‌కు చేరుకోవాలంటే ఆడే అవకాశం లభించే మ్యాచ్‌ల్లో గెలవాలనే ఒత్తిడిలో అన్ని జట్లూ ఉన్నాయి. అలాగే ఈ విజయంలో ప్రత్యర్థి జట్టును భారీ తేడాతో ఓడించడం కూడా ముఖ్యం. కాగా శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా రద్దయ్యాయి. కాబట్టి న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పుడు 3 పాయింట్లను కలిగి ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా -1.555 రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఆసీస్‌ సెమీస్‌ చేరుకోవాలంటే సూపర్‌12లో మిగతా మ్యాచ్‌లన్నీ గెలవడం తప్పనసిరి. అలాగే ఇంగ్లాండ్‌ లేదా న్యూజిలాండ్‌ మిగతా మ్యాచ్‌ల్లో ఓడాలి. అప్పుడే ఆతిథ్య జట్టు నాకౌట్‌ రేసుకు చేరుకుంటుంది. ఇక పాయింట్ల పట్టికలో మిగతా జట్ల ఏయే స్థానాల్లో ఉన్నాయంటే?

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..