సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విరుష్క జంట త్రో బ్యాక్ వీడియో.. వారితోపాటు ఎవరున్నారో తెలుసా..
కొత్త ఏడాది ఆరంభంలోనే అభిమానులను గుడ్ న్యూస్ చెప్పారు విరాట్ కోహ్లీ తమకు పండంటి బిడ్డ జన్మించిందని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ జంట తరచు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు.
virat kohli-anushka sharma : కొత్త ఏడాది ఆరంభంలోనే అభిమానులను గుడ్ న్యూస్ చెప్పారు విరాట్ కోహ్లీ తమకు పండంటి బిడ్డ జన్మించిందని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ జంట తరచు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. బిడ్డకు జన్మనివ్వక ముందు విరుష్క జంట విహారయాత్రలకు వెళ్లిన ఫోటోలను,వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోయారు.
తాజాగా వీరికి సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కెఎల్ రాహుల్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు విరుష్క జంట కూడా ఉన్నారు. జాలీ హార్బర్ ఆంటిగ్వాలోని సముద్రం మధ్య బోట్ లో చిల్ అవుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను గతంలో కెఎల్ రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కుమార్తెతో ఉన్న మొదటి చిత్రాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు తమ కుమార్తె పేరును కూడా ప్రకటించారు. తమ చిన్నారికి ‘వామికా’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా ‘వామికా’ అని పేరు పెట్టారు.
View this post on Instagram