AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Salary : బీసీసీఐ కాంట్రాక్ట్.. కోహ్లీ, రోహిత్​లకు సమానంగా జీతం తీసుకునే ఆటగాళ్లు వీళ్లే.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్, టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడే రోహిత్, కోహ్లీ, బీసీసీఐ నుంచి భారీ జీతం తీసుకుంటారు. బీసీసీఐ సాలరీ సిస్టమ్ ప్రకారం ఆటగాళ్ళను 4 గ్రేడులుగా విభజించారు. భారత క్రికెట్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే ఉన్నారు. వీరు రోహిత్, విరాట్‌తో సమానంగా జీతం తీసుకుంటారు.

BCCI Salary : బీసీసీఐ కాంట్రాక్ట్.. కోహ్లీ, రోహిత్​లకు సమానంగా జీతం తీసుకునే ఆటగాళ్లు వీళ్లే.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Bcci Salary
Rakesh
|

Updated on: Sep 06, 2025 | 7:20 AM

Share

BCCI Salary : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడే ఈ ఇద్దరు భారత క్రికెటర్లు, బీసీసీఐ నుంచి భారీ జీతం తీసుకుంటున్నారు. బీసీసీఐ సాలరీ సిస్టమ్ ప్రకారం.. ఆటగాళ్లను నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రోహిత్, విరాట్‌లతో సమానంగా జీతం తీసుకుంటున్నారు.

రోహిత్, విరాట్ జీతం ఎంత?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఆటగాళ్లను నాలుగు గ్రేడ్‌లుగా విభజించారు. వీరికి గ్రేడ్ A+, గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C కింద జీతాలు ఇస్తారు.

గ్రేడ్ A+: ఈ క్రికెటర్లకు సంవత్సరానికి రూ.7 కోట్లు జీతం లభిస్తుంది.

గ్రేడ్ A: ఈ ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.5 కోట్లు జీతం లభిస్తుంది.

గ్రేడ్ B: ఈ ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.3 కోట్లు జీతం లభిస్తుంది.

గ్రేడ్ C: ఈ ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.1 కోటి జీతం లభిస్తుంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ A+లో ఉండటం వల్ల, బీసీసీఐ వారికి సంవత్సరానికి రూ.7 కోట్లు జీతం ఇస్తుంది.

ఆ ఇద్దరు ఆటగాళ్లు వీరే!

రోహిత్ శ, విరాట్ కోహ్లీతో పాటు, గ్రేడ్ A+లో కేవలం జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. అందుకే వీరికి కూడా రోహిత్, విరాట్​లకు సమానంగా బీసీసీఐ సంవత్సరానికి రూ.7 కోట్ల జీతం ఇస్తుంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్​లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌లో ఈ ఇద్దరు ఆడటం లేదు. ఎందుకంటే, విరాట్, రోహిత్ టీ20 ఫార్మాట్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పారు. విరాట్, రోహిత్ 2025లో టీమ్ ఇండియా తరఫున అన్ని వన్డే మ్యాచ్​లలో ఆడితే ఈ సంవత్సరం వారు కేవలం 6 మ్యాచ్​లు మాత్రమే ఆడతారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!