Pujara: పరుగులు చేయడానికి కాస్త సమయం తీసుకున్నా.. లేదంటే బౌలర్లకు చుక్కలే అంటున్న టీం ఇండియా నయావాల్..

Cheteshwar Pujara: ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా టెస్ట్ సిరీస్ గెలవడంలో బ్యాట్స్‌మెన్ పుజారా పాత్ర ఎంతో కీలకమైంది. ఇందులో ఎటువంటి

Pujara: పరుగులు చేయడానికి కాస్త సమయం తీసుకున్నా.. లేదంటే బౌలర్లకు చుక్కలే అంటున్న టీం ఇండియా నయావాల్..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 6:24 AM

Cheteshwar Pujara: ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా టెస్ట్ సిరీస్ గెలవడంలో బ్యాట్స్‌మెన్ పుజారా పాత్ర ఎంతో కీలకమైంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొంతమంది 2018-19 ఆస్ట్రేలియా పర్యటన, 2020-21 పర్యటనలను పోల్చుతూ పుజారా ఆటతీరును అంచనా వేస్తున్నారు. రెండు పర్యటనల స్ట్రైక్‌రేట్‌‌ను పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన పుజారా పరిస్థితులకు తగ్గట్టుగాఆడానని చెప్పుకొచ్చాడు.

గణాంకాల పరంగా చూస్తే తన ప్రదర్శన గొప్పగా లేదని కానీ ఇది నాకు ఎంతో మంచి సిరీస్‌ అని బదులిచ్చాడు. పిచ్‌ పరిస్థితుల కారణంగా గత పర్యటన కంటే ఈ సారి తక్కువ పరుగులు చేశానని, అయితే రెండు పర్యటనలను పోల్చడం కష్టతరమని చెప్పాడు. ఇక స్ట్రైక్‌రేట్ ప్రధానమైనది కాదని ఆ సమయంలో బంతులు ఎదుర్కోవడమే ముఖ్యమని తెలిపాడు. పరుగులు చేయడానికి కొంచెం సమయం తీసుకున్నానని కానీ తాను క్రీజులో ఉంటే బౌలర్లు ఇబ్బందిపడతారని బదులిచ్చాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఆడనని పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న సమయంలో మాత్రమే వేగం పెంచుతానన్నాడు. స్ట్రోక్‌ ప్లేయర్లు రోహిత్, పంత్‌ జట్టులో ఉన్నప్పుడు తాను జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడం ఎంతో అవసరమని అందరికి గుర్తుచేశాడు.

అతడిని రెచ్చగొడితే ఊచకోత కోస్తాడు.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు..\