AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా తమిళనాడు.. బరోడాతో జరిగిన ఫైనల్‌ పోరులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Syed Mushtaq Ali Trophi: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ విజేతగా తమిళనాడు రెండోసారి విజయకేతనం ఎగరేసింది. అహ్మదాబాద్‌ వేదికగా బరోడా జరిగిన

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా తమిళనాడు.. బరోడాతో జరిగిన ఫైనల్‌ పోరులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం..
uppula Raju
|

Updated on: Feb 01, 2021 | 6:20 AM

Share

Syed Mushtaq Ali Trophi: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ విజేతగా తమిళనాడు రెండోసారి విజయకేతనం ఎగరేసింది. అహ్మదాబాద్‌ వేదికగా బరోడా జరిగిన ఫైనల్‌ పోరులో తమిళనాడు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. బరోడా జట్టులో సోలంకీ(49: 55 బంతుల్లో) టాప్‌ స్కోరర్ నిలిచాడు. సేత్‌(29: 30 బంతుల్లో) రాణించాడు. తమిళనాడు జట్టులో మనిమరన్‌ సిద్ధార్థ్‌ 4 వికెట్లు ఆ జట్టును పేకమేడలా కూల్చాడు. అనంతరం 121 పరుగులతో బ్యాటింగ్‌ చేపట్టిన తమిళనాడు 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. తమిళనాడు జట్టులో హరినిశాంత్‌(35) టాప్‌ స్కోరర్‌. జగదీశన్‌(14), బాబా అపరాజిత్‌(29 నాటౌట్‌), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (22) షారుఖ్‌ ఖాన్‌(18) పరుగులు చేశారు. సూపర్‌ బౌలింగ్‌‌తో బరోడా జట్టును కూల్చిన బౌలర్‌ మణిమరన్‌ సిద్ధార్థ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?