Virushka’s Daughter First Photo:ముద్దుల తనయని ఫ్యాన్స్ కి పరిచయం చేసిన విరుష్క జంట.. వామిక అంటే అర్ధం తెలుసా..!
భారతదేశంలో మోస్ట్ లవబుల్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కలు. ఈ జంట ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు తమ కుమార్తె..
Virushka’s Daughter First Photo:భారతదేశంలో మోస్ట్ లవబుల్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కలు. ఈ జంట ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు తమ కుమార్తె పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనుష్క ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన కుమార్తె పేరును వామిక గా పెట్టినట్లు ప్రకటించారు. విరుష్క దంపతులు జనవరిలో తల్లిదండ్రులు గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు వారి ముద్దుల తనయకు నామకమరణం చేశారు.
ఆ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో అనుష్క వామికను ఎత్తుకుని మురిపెంగా చేస్తుంటే.. పక్కనే కోహ్లీ కుమార్తె ముద్దుల మోమును ప్రేమగా చూస్తున్నట్లుంది.. మేము ప్రేమలో కలిసి ఉన్నాము, మా ప్రేమ మరియు విశ్వాసం వామిక రాకతో మరికొత్త రూపం సంతరించుకుంది. కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం.. కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు.. మీ కోరికలు, ప్రార్థనలు మాకు మరింత శక్తిని ఇచ్చాయి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని విరుష్క జంట తెలిపారు. వామిక అంటే మన పురాణం ప్రకారం దుర్గామాత అనే అర్ధం. ఈ సెలబ్రెటీల తనయ వారిలాగే మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: తండ్రి దగ్గర పెరిగినా తల్లిని గుర్తు చేసే హిమ.. రియల్ లైఫ్ లో కన్నీటిమయమట