Watch Video: అథ్లెట్‌గా మారిన టీమిండియా రన్ మెషీన్.. కూల్‌గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ నెటిజన్లకు షాక్.. వైరల్ వీడియో..

కోహ్లీ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరమైన సంగతి తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ గత కొన్ని నెలలుగా పరుగుల కోసం కష్టపడుతూ, ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు.

Watch Video: అథ్లెట్‌గా మారిన టీమిండియా రన్ మెషీన్.. కూల్‌గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ నెటిజన్లకు షాక్.. వైరల్ వీడియో..
Virat Kohli Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 18, 2022 | 11:19 AM

భారత్ 22 బంగారు పతకాలతో కామన్వెల్త్ క్రీడలను ముగించిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని బంగారు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో దక్కాయి. ఈ క్రీడలో మొత్తం మూడు రంగులలో 10 పతకాలను భారత ఆటగాళ్లు దక్కించుకున్నారు. గెలిచిన పతకాల సంఖ్యా పరంగా ఈ బృందం అత్యంత విజయవంతమైన క్రీడగా నిలిచింది. అయితే, ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. వస్తున్నాం.. అక్కిడికే వస్తున్నాం. తాజాగా మరొక స్టార్ భారతీయ అథ్లెట్ తన వెయిట్ లిఫ్టింగ్ నైపుణ్యాలతో నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాడు. ఇది మీరాబాయి చాను, జెరెమీ లాల్రిన్నుంగా వంటి వారిని గర్వించేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అవునండీ బాబు.. నమ్మలేకపోతున్నారా.. అసలువ విషయంలోకి వెళ్తే మీరే షాక్ అవుతారు.

విరాట్ కోహ్లీ బుధవారం జిమ్ సెషన్‌లో వెయింట్ లిఫ్టింగ్ ఎత్తుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీలో ఈ టైప్ అథ్టెల్ కూడా ఉన్నాడా అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా కోహ్లీ ఇలాంటి వీడియోలను షేర్ చేశాడు. అయితే, తాజా వీడియోలో మాత్రం.. వెయిట్ లిఫ్ట్‌ చేస్తున్నప్పుడు కోహ్లి టెక్నిక్ చాలా ఆశ్చర్యంగా ఉంది. వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో డ్యాన్స్‌ చేస్తు్న్నట్లుగా కనిపించాడు. అయితే, కొంతమంది మాత్రం, క్రికెట్‌లో చూపిస్తే బాగుటుందంటూ విమర్శలు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరమయ్యాడు. భారత మాజీ కెప్టెన్ గత కొన్ని నెలలుగా పరుగుల కోసం కష్టపడుతున్నాడు. ఆసియా కప్‌లో జాతీయ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో పాత కోహ్లీ రన్ మెషీన్‌ను చూస్తామంటూ అభిమానులు భావిస్తున్నారు.