Video: అంతర్జాతీయ క్రికెట్‌లో యార్కర్ కింగ్ విధ్వంసం.. అత్యంత విజయవంతమైన బౌలర్‌గా రికార్డ్..
Jasprit Bumrah: చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు.. 100 పరుగులలోపే రెండు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టే పనిని జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు.

Jasprit Bumrah: చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు.. 100 పరుగులలోపే రెండు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టే పనిని జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు. అతను జకీర్ హసన్ (33)ను అవుట్ చేశాడు. ఈ వికెట్‌తో 2024లో అంతర్జాతీయంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.
కాగా, మూడో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని భారత్ అందించింది.
ప్రస్తుతం చెపాక్ స్టేడియంలో మూడో రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతోంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ పడగొట్టిన బుమ్రా..
<blockquote class=”twitter-tweet”>
क्या कैच है।
लाजवाब, शानदार#Bumrah #JaspritBumrah #indvsbangladesh #jaiswal #iPhone16Propic.twitter.com/3xAAmtebSp
— Abhinaw Tripathi (@AbhinawKTri) September 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
