AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 632 రోజుల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో ధోని రికార్డ్‌నే మడతెట్టేశాడు..

Rishabh Pant Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో 3వ రోజు రిషబ్ పంత్ సెంచరీతో అలరించాడు. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. కాగా, పంత్ 124 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ చేశాడు.

Video: 632 రోజుల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో ధోని రికార్డ్‌నే మడతెట్టేశాడు..
Rishabh Pant Century
Venkata Chari
|

Updated on: Sep 21, 2024 | 2:54 PM

Share

Rishabh Pant Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో 3వ రోజు రిషబ్ పంత్ సెంచరీతో అలరించాడు. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. కాగా, పంత్ 124 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ చేశాడు.

డిసెంబరు 2022లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పంత్.. టెస్ట్ క్రికెట్‌కి తిరిగి వచ్చి ఈ విశేషమైన ఫీట్‌ను నెలకొల్పాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, పంత్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో ప్రొఫెషనల్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. అక్కడ అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే ముందు దులీప్ ట్రోఫీ ద్వారా పంత్ రెడ్-బాల్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత కీపర్లు..

రిషబ్ పంత్ – 6

ఎంఎస్ ధోని – 6

వృద్ధిమాన్ సాహా – 3

రిషబ్ పంత్ సెంచరీ వీడియో..

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కీపర్లు..

ఆడమ్ గిల్‌క్రిస్ట్ (AUS) – 17

ఆండీ ఫ్లవర్ (ZIM) – 12

లెస్ అమెస్ (ENG) – 8

ఏబీ డివిలియర్స్ (SA) – 7

ఎంజే ప్రియర్ (ENG) – 7

కుమార్ సంగక్కర (SL) – 7

బీజే వాట్లింగ్ (ENG) – 7

క్వింటన్ డి కాక్ (SA) – 6

ఎంఎస్ ధోని (IND) – 6

కమ్రాన్ అక్మల్ (PAK) – 6

ముష్ఫికర్ రహీమ్ (BAN) – 6

ఏజే స్టీవర్ట్ (ENG) – 6

రిషబ్ పంత్ (IND) – 6

మ్యాచ్ పరిస్థితి..

ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 68 పరుగులు చేసింది. అయితే, ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం నల్లేరుపై నడకనే చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..