AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైన టీమిండియా పేస్ బౌలర్.. ముంబైలో ఘనంగా నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోలు, వీడియోలు

Shardul Thakur: 30 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు నాలుగు టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైన టీమిండియా పేస్ బౌలర్.. ముంబైలో ఘనంగా నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోలు, వీడియోలు
Shardul Thakur Engagement
Venkata Chari
|

Updated on: Nov 29, 2021 | 12:51 PM

Share

Shardul Thakur Engagement: భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ నిశ్చితార్థం జరిగింది. ముంబై నుంచి వచ్చిన ఈ ఆటగాడు నవంబర్ 29న తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు రెండూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భారత క్రికెటర్లలో ఎవరైనా ఈవేడుకలో పాలు పంచుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

30 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు నాలుగు టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇటీవలి కాలంలో శార్దూల్ మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. టెస్టుల్లో బ్యాట్‌తోనూ అద్భుతాలు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ కారణంగా, అతను చాలా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

శార్దూల్ కెరీర్.. శార్దూల్ ఠాకూర్ ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన పాల్ఘర్‌కు చెందినవాడు. 2017లో టీమ్ ఇండియాలో అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2018లో టెస్టు అరంగేట్రం జరిగింది. ఇప్పటి వరకు టెస్టుల్లో 14, వన్డేల్లో 22, టీ20ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మతో కలిసి ఆడుతూ ముందుకు సాగారు. ఇద్దరూ ఒకే కోచ్ దినేష్ లాడ్ నుంచి క్రికెట్‌లోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత కూడా సాధించాడు.

ఆ తర్వాత ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తూ టీమ్‌ఇండియాలో చోటు సంపాదించాడు. ముంబైని రంజీ ఛాంపియన్‌గా మార్చడంలో కూడా శార్దుల్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో అతని అరంగేట్రం పంజాబ్ కింగ్స్‌తో మొదలైంది. అయితే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు వచ్చి విజయాన్ని అందుకున్నాడు. 2018, 2021లో టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు.

Also Read: IND vs SA: పొంచి ఉన్న ఓమిక్రాన్ ముప్పు.. భారత్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన ద.ఆఫ్రికా టీం సీఈవో

Ashes: యాషెస్‌పై ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉండదు.. సిరీస్‌ సానుకూలంగా సాగుతుంది: ఇంగ్లండ్ టీం