AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఆరేళ్ల క్రితం హర్షా భోగ్లే చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‎గా మారింది.. ఆ ట్వీట్ ఎవరి గురించి అంటే..

క్రికెట్ వ్యాఖ్యతగా హర్షా భోగ్లే ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను కవర్ చేసి, అనేక తరాల భారత క్రికెటర్లను వీక్షించిన అతను, ఒక యువ క్రికెటర్‌ గురించి ఆరేళ్ల క్రితం చేసిన ట్విట్టర్ ప్రస్తుతం వైరల్‎గా మారింది...

IND vs NZ: ఆరేళ్ల క్రితం హర్షా భోగ్లే చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‎గా మారింది.. ఆ ట్వీట్ ఎవరి గురించి అంటే..
Harsha
Srinivas Chekkilla
|

Updated on: Nov 29, 2021 | 10:56 AM

Share

క్రికెట్ వ్యాఖ్యతగా హర్షా భోగ్లే ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను కవర్ చేసి, అనేక తరాల భారత క్రికెటర్లను వీక్షించిన అతను, ఒక యువ క్రికెటర్‌ గురించి ఆరేళ్ల క్రితం చేసిన ట్విట్టర్ ప్రస్తుతం వైరల్‎గా మారింది. హర్ష భోగ్లే 6 సంవత్సరాల క్రితం 2015లో యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి ట్వీట్ చేశారు. అప్పుడు అయ్యర్ భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అప్పుడే శ్రేయాస్ అయ్యర్ ఆటను చూసిన హర్షా భోగ్లే, 2015లో తన ట్వీట్టర్‎లో శ్రేయాస్ అయ్యర్ కెరీర్‌ను నిశితంగా పరిశీలించబోతున్నట్లు రాశారు.

శ్రేయాస్ అయ్యర్ కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కోసం, అతను ఇప్పుడు కోసం టెస్ట్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. కాన్పూర్ న్యూజిలాండ్‎తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‎లో సెంచరీ చేసిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్‎లో 65 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ, యాభై పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా 26 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.

హర్షా భోగ్లే నిన్న స్వయంగా శ్రేయాస్ అయ్యర్ గురించి 6 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌ను ఆయన ట్యాగ్ చేస్తూ “చూడండి, ఏమి జరిగిందో” అని రాసుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో అతను చాలా ఉన్నతంగా గర్తింపు పొందిన యువకుడు ఇప్పుడు భారతదేశం కోసం భవిష్యత్తులో చాలా మ్యాచ్‌లు గెలవగల ఆటగాడిగా మారినందుకు భోగ్లే చాలా సంతోషంగా ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ముంబైలో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

Read Also… IND vs NZ: వృద్ధిమాన్ సాహా అంతిమ పోరాట యోధుడు.. మెడ నొప్పి ఉన్నా ఆడాడు..

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?