AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: పొంచి ఉన్న ఓమిక్రాన్ ముప్పు.. భారత్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన ద.ఆఫ్రికా టీం సీఈవో

క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) యాక్టింగ్ సీఈవో ఫోలేట్సీ మోసె మాట్లాడుతూ, ఈ సిరీస్ ఇంకా పరిగణలోనే ఉందని, సిరీస్ సాఫీగా సాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

IND vs SA: పొంచి ఉన్న ఓమిక్రాన్ ముప్పు.. భారత్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన ద.ఆఫ్రికా టీం సీఈవో
Ind Vs Sa Series
Venkata Chari
|

Updated on: Nov 29, 2021 | 12:07 PM

Share

India vs South Africa: కొత్త కోవిడ్-19 వేరియంట్ ‘ఓమిక్రాన్’ దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అన్ని దేశాలు కఠిన ఆంక్షలు ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ కొత్త వేరియంట్ ఆదేశంలో జరిగే ముఖ్యమైన పోటీలన్నీ వాయిదా వేస్తున్నారు. ఈ మేరకు క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) యాక్టింగ్ సీఈవో ఫోలేట్సీ మోసె మాట్లాడుతూ, ఈ సిరీస్ ఇంకా పరిగణలోనే ఉందని, సిరీస్ సాఫీగా సాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

యునైటెడ్ రగ్బీ ఛాంపియన్‌షిప్, జూనియర్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ వంటి రెండు టోర్నమెంట్‌లు ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా వాయిదా వేశారు. దక్షిణాఫ్రికా (క్రికెట్)లో భారత పర్యటన షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఏ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ పూర్తయింది. మరో మూడు టెస్టులు ఉన్నాయి.

“మేం బీసీసీఐతో మాట్లాడాం. వారు పర్యటనకు సిద్ధంగానే ఉన్నారు” అని CSA యాక్టింగ్ సీఈవో మోసెకి ఆదివారం పేర్కొన్నాడు. “ఇండియా ఏ ఇంకా ఇక్కడే ఉంది. వారు వెళ్లిపోయే సూచనలైతే లేవు. ఇప్పటికీ పర్యటనను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారు. వారు పర్యటన ముందుకు సాగాలని ఆశిస్తున్నారు” అని పేర్కొన్నాడు. మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న CSAకి ఈ పర్యటన ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకంగా ఉంటుంది. అందుకే ఈ పర్యటన కొనసాగించేందుకు దక్షిణాఫ్రికా కూడా ఎదురుచూస్తోంది.

దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా వెలుగుచూసిన మహమ్మారితో పోరాడటానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్-19 కొత్త వేరియంట్‌తో భయాందోళనలు నెలకొనడంతో పలు సిరీస్‌లు కూడా వాయిదా పడుతున్నాయి. అనేక దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలను నిషేధించాయి. అభివృద్ధి చెందుతోన్న దేశంలో క్రీడా పోటీలకు అంతరాయం కలిగించింది.

పర్యటన ఖచ్చితంగా కొనసాగుతోందని మోసె ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఉన్నప్పటికీ, డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలు, 4 టీ20ఐలు, 3 టెస్టులతో కూడిన పూర్తి స్థాయి సిరీస్‌కు CSA ఆతిథ్యం ఇస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో మరోసారి ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. “అభిమానులను స్టేడియం లోపలికి అనుమతిస్తారా అనేది మిగిలి ప్రస్తుత ప్రశ్న. మేం స్టేడియంలో ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉండాలని ఆశిస్తున్నాం” అని మోసె తెలిపాడు.

“మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అయితే ఇప్పుడు చేయగలిగింది ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉండడమే. ఏం జరుగుతుందో చూడాలి. మేం దేశం మొత్తం లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితికి రాలేమని ఆశిస్తున్నాం” అని ఆయన అన్నాడు.

పర్యటన కొనసాగితే డిసెంబర్ 9న టీమిండియా బయలుదేరాల్సి ఉంది. బీసీసీఐ, CSA రెండూ టూర్‌కు సంబంధించి నిరంతరం టచ్‌లో ఉన్నాయి. మా బయో-బుడగలు చాలా బలంగా ఉన్నాయని మోసె తెలిపాడు.

“మేం పాకిస్తాన్, శ్రీలంకలతో ఆడిన విధంగానే ప్రేక్షకులు లేకుండా ఆడగలం. ఎందుకంటే మేము బలమైన బయో-బుడగలను సిద్ధం చేశాం” అని మోసె తెలిపాడు.

దక్షిణాఫ్రికాలో భారత పర్యటన: పూర్తి షెడ్యూల్

మొదటి టెస్టు – జోహన్నెస్‌బర్గ్ (డిసెంబర్ 17-21)

రెండో టెస్టు – సెంచూరియన్ (డిసెంబర్ 26-30)

మూడో టెస్ట్ – కేప్ టౌన్ (జనవరి 3-7)

మొదటి వన్డే – పార్ల్ (జనవరి 11)

రెండవ వన్డే – కేప్ టౌన్ (జనవరి 14)

మూడో వన్డే – కేప్ టౌన్ (జనవరి 16)

మొదటి టీ20 ఇంటర్నేషనల్ – కేప్ టౌన్ (జనవరి 19)

రెండవ టీ20 ఇంటర్నేషనల్ – కేప్ టౌన్ (జనవరి 21)

మూడో టీ20 ఇంటర్నేషనల్ – పార్ల్ (జనవరి 23)

నాల్గవ T20 ఇంటర్నేషనల్ – పార్ల్ (జనవరి 26)

Also Read: Ashes: యాషెస్‌పై ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉండదు.. సిరీస్‌ సానుకూలంగా సాగుతుంది: ఇంగ్లండ్ టీం

IND vs NZ, Live, 1st Test, Day 5: 50 పరుగులు దాటిన న్యూజిలాండ్.. వికెట్ల కోసం భారత బౌలర్ల తిప్పలు