Ashes: యాషెస్‌పై ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉండదు.. సిరీస్‌ సానుకూలంగా సాగుతుంది: ఇంగ్లండ్ టీం

AUS vs ENG: తాజా కోవిడ్-19 వేరియంట్‌తో అప్రమత్తమైన ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలు కొత్త ప్రయాణ పరిమితులను ప్రవేశపెట్టాయి. ఈ మేరకు పలు విమానాశ్రాయాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Ashes: యాషెస్‌పై ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉండదు.. సిరీస్‌ సానుకూలంగా సాగుతుంది: ఇంగ్లండ్ టీం
Ashes Series
Follow us

|

Updated on: Nov 29, 2021 | 10:42 AM

Ashes: కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే పలు దేశాల్లో వెలుగుచూడడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో జరిగే కీలక టోర్నీలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా దక్షిణాఫ్రికా టూర్‌ను వాయిదా వేసేందుకు సిద్ధమైంది. అయితే రాబోయే యాషెస్‌ సిరీస్‌ కూడా ప్రమాదంలో పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ క్రికెట్ టీం మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ మాట్లాడుతూ, యాషెస్ సిరీస్‌లో అలాంటి పరిస్థితులు ఉందబోవని పేర్కొన్నాడు.

“కొత్త వేరియంట్ ప్రభావం ఈ సిరీస్‌పై ఉండదని మేం స్పష్టంగా ఆశిస్తున్నాం. మా కుటుంబాలు ప్రయాణంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటుననాయి. అది మమ్మల్ని ప్రభావితం చేయదని మేం స్పష్టంగా చెబుతున్నాం. కానీ మా చేతిలో ఏదీలేదు. ఇరు ప్రభుత్వాలు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాయని భావిస్తున్నాం” అని గైల్స్‌ ఈఎస్‌పీఎన్‌తో అన్నారు.

తాజా కోవిడ్-19 వేరియంట్‌తో అప్రమత్తమైన ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలు కొత్త ప్రయాణ పరిమితులను ప్రవేశపెట్టాయి. ఈ మేరకు పలు విమానాశ్రాయాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. “పరిస్థితులు మారగలవని తెలుసు. మేం సిరీస్‌లో కొనసాగుతున్నందున మార్పులు సానుకూలంగా ఉంటామని ఆశిస్తున్నాం, అయితే గత రెండు సంవత్సరాలుగా పలు కోవిడ్ వేరియంట్‌లతో మాకు అవగాహన ఉంది” అని గైల్స్ తెలిపారు.

“మేము అన్నింటికీ సిద్ధం కాగలం? దిగ్బంధం సమయాల్లోనూ మేం వివిధ రాష్ట్రాల చుట్టూ మేం పర్యటించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను మా కుటుంబాలతో మేం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో కుటుంబాలరే వసతి, క్రీడాకారులను సంతోషంగా ఉండేలా చూసుకోవడమే మా మొదటి ప్రాధాన్యం. దీని కోసం అన్ని ప్రయత్నాలు మేం చేస్తామని” అన్నారాయన. యాషెస్ సిరీస్‌ డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో ప్రారంభం కానుంది.

Also Read: IND vs NZ: భారత్ ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందా.. ఆకాష్ చోప్రా ఏం చెప్పాడు..

IND vs NZ, Live, 1st Test, Day 5: వికెట్ల కోసం భారత బౌలర్ల ఎదురుచూపులు.. పోరాడుతోన్న న్యూజిలాండ్..!